అత‌ని ల‌గేజీ బ‌స్‌లో మిస్ అయింది. క్యాబ్ డ్రైవ‌ర్ స‌హాయంతో అత‌ను బ‌స్సును అందుకున్నాడా..? రియ‌ల్ స్టోరీ..!

”అర్థ‌రాత్రి 2 గంట‌లు అవుతోంది. అప్పుడే హైద‌రాబాద్ నుంచి వ‌చ్చా. అక్క‌డ ఓ కాంపిటీష‌న్‌లో పాల్గొన్నా. బెంగుళూరుకు చేరుకునే స‌రికి రాత్రి 2 గంట‌లైంది. బెంగుళూరు కార్పొరేష‌న్ సర్కిల్‌లో బ‌స్సు దిగా. అక్క‌డి నుంచి కాలేజీ హాస్ట‌ల్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంతలో క్యాబ్ బుక్ చేశా. క్యాబ్ కాసేప‌ట్లో వ‌స్తుంద‌న‌గా, అప్పుడే తెలిసింది నాకు, నా ల‌గేజీ కొంత మిస్ అయ్యాయ‌ని. దాంట్లో నాకు చాలా ముఖ్య‌మైన వ‌స్తువులు ఉన్నాయి. ప‌ర్సు, న‌గ‌దు, కార్డులు అన్నీ అందులోనే ఉన్నాయి. దీంతో కంగారు మొద‌లైంది. ఏమాత్ర ఆల‌స్యం చేయకుండా ఆ బ‌స్సు ట్రావెల్స్ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేశా. డ్రైవ‌ర్ నంబ‌ర్ ఇచ్చారు. బ‌స్సు డ్రైవ‌ర్‌కు వెంట‌నే కాల్ చేశా. అత‌నికి తెలుగు మాత్ర‌మే వ‌చ్చు. నాకు హిందీ మాత్ర‌మే తెలుసు. అయినా మాట్లాడా. దీంతో నాకు తెలిసింది ఏమిటంటే.. అత‌ను న‌న్ను కార్పొరేష‌న్ స‌ర్కిల్‌లో డ్రాప్ చేసిన వెంట‌నే 25 కిలోమీట‌ర్ల దూరం వెళ్లిపోయాడు.

ఇక నా ల‌గేజీ దొర‌క‌డం అసాధ్యం అనిపించింది. నా ఒక్క‌డి కోసం ఆ డ్రైవ‌ర్‌ బ‌స్సు వెన‌క్కి తేలేడు. వారికి ఇత‌ర ప్ర‌యాణికులు ముఖ్యం. ఇక నా ల‌గేజీ దొర‌క‌ద‌నే అనుకున్నా. అలా అనుకుంటూ ఉండ‌గానే క్యాబ్ వ‌చ్చింది. అది షేరింగ్ క్యాబ్‌. నాతోపాటు ఇంకో వ్య‌క్తిని మ‌రికొంత దూరంలో పిక‌ప్ చేసుకోవాల్సి ఉంది. విష‌యం క్యాబ్ డ్రైవ‌ర్‌కు చెప్పా. వెంట‌నే బ‌స్‌ను క్యాచ్ చేద్దామ‌ని అన్నాడు. అత‌నికి తెలుగు తెలుసు. దీంతో వెంట‌నే బ‌స్ డ్రైవ‌ర్‌కు ఫోన్ చేసి క్యాబ్ డ్రైవ‌ర్‌తో మాట్లాడించా. అప్ప‌టికి బ‌స్సు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఆల‌స్యం చేసే బ‌స్సు మిస్ అవుతుంద‌ని చెప్పి క్యాబ్ డ్రైవ‌ర్ వేగంగా కారును పోనిచ్చాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో అత‌ను బ‌స్ డ్రైవ‌ర్‌తో ట‌చ్‌లో ఉన్నాడు.

ఎట్ట‌కేల‌కు బ‌స్ దొరికింది. అప్ప‌టికే అది చాలా దూరం వెళ్లిపోయింది. అందులోకి ఎక్కి ల‌గేజ్ తీసుకున్నా. కాలేజీ హాస్ట‌ల్‌కు క్యాబ్‌లో వెళ్లా. క్యాబ్ డ్రైవ‌ర్ కేవ‌లం కార్పొరేష‌న్ స‌ర్కిల్ నుంచి కాలేజీ హాస్ట‌ల్‌కు ఎంత‌వుతుందో అంతే మొత్తం తీసుకున్నాడు. బ‌స్సు కోసం వెళ్లి వ‌చ్చిన దూరానికి అత‌ను చార్జి చేయ‌లేదు. నిజంగా అర్థ‌రాత్రి పూట 2 గంట‌ల స‌మ‌యంలో అత‌ను నా కోసం దైవంచే పంప‌బ‌డ్డాడ‌నే అనుకున్నా. అలాంటి డ్రైవ‌ర్‌కు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. థ్యాంక్స్ చెప్పా… అత‌ను న‌వ్వుతూ ముందుకు సాగిపోయాడు.”

— బెంగుళూరులో వైభ‌వ్ వ్యాస్ అనే వ్య‌క్తికి ఎదురైన అనుభ‌వ‌మే ఈ సంఘ‌ట‌న‌. రియ‌ల్ స్టోరీ..!

Comments

comments

Share this post

scroll to top