అత‌ను 466 రోజుల పాటు 6300 మైళ్ల దూరం న‌డిచాడు… ఇంకా న‌డుస్తూనే ఉన్నాడు… ఎందుకో తెలుసా..?

న‌డక అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో అంద‌రికీ తెలిసిందే. నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే రోజూ వాకింగ్ చేసే వారు త‌మ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి ఎన్నో కొన్ని కిలోమీట‌ర్ల వ‌ర‌కు వాకింగ్ చేస్తారు. కానీ ఆ వ్య‌క్తి మాత్రం అందుకు భిన్నం. ఇప్ప‌టికి దాదాపు సంవ‌త్స‌రం పైనే అయింది. అయినా త‌న వాకింగ్ ఆప‌లేదు. రోజుల త‌ర‌బ‌డి త‌న న‌డ‌కను కొన‌సాగిస్తూనే ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపుగా 6300 మైళ్ల దూరం న‌డిచాడు. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. అత‌నలా ఎందుకు న‌డుస్తున్నాడో తెలిస్తే, అందుకు మీరు కూడా అత‌నికి సానుభూతి తెలుపుతారు. అవును, మ‌రి!

tom-turcich-walk

అత‌ని పేరు టామ్ టుర్సిచ్‌. వ‌య‌స్సు 25 సంవ‌త్స‌రాలు. న్యూ జెర్సీలో అత‌ని నివాసం. చిన్న‌ప్ప‌టి నుంచి ట్రావెలింగ్ అంటే అత‌నికి ఇష్టం. కాగా అత‌ను 17వ ఏట ఉన్న‌ప్పుడు త‌న క్లోజ్ ఫ్రెండ్ అయిన అన్నెమేరీ మృతి చెందింది. దీంతో టామ్ తీవ్రంగా డిప్రెష‌న్‌కు లోన‌య్యాడు. అయినా తేరుకుని త‌న స్నేహితురాలి జ్ఞాప‌కార్థం ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంలోనే భూమిపై ఉన్న 7 ఖండాల‌ను క‌వ‌ర్ చేసేలా అన్ని దేశాల్లోనూ క‌లిపి మొత్తం 22వేల మైళ్లను కాలిన‌డ‌క‌నే న‌డ‌వాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. కాగా టామ్ ప్ర‌య‌త్నానికి మ‌ద్ద‌తుగా ఓ కంపెనీ ఆర్థిక స‌హ‌కారాన్ని కూడా అందించేందుకు ముందుకు వ‌చ్చింది. అత‌ను న‌డిచే ఒక్క మైలుకు గాను ఆ కంపెనీ ఒక డాల‌ర్‌ను విరాళంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. అయితే టామ్ కూడా అలా విరాళంగా వ‌చ్చిన మొత్తాన్ని త‌న స్నేహితురాలి పేరిట ఓ ట్ర‌స్టును ఏర్పాటు చేసి సామాజిక సేవ ద్వారా ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం విశేషం.

టామ్ తీసుకున్న కాలి న‌డ‌క నిర్ణ‌యం ఇప్పుడు కూడా కొన‌సాగుతోంది. గ‌తేడాది ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభ‌మైన ఈ న‌డ‌క ఇప్ప‌టికీ అలాగే కంటిన్యూ అవుతోంది. ప్ర‌సుత్తానికి టామ్ 466 రోజుల న‌డ‌క‌ను పూర్తి చేసుకుని 6300 మైళ్ల దూరం న‌డిచాడు. ఈ క్ర‌మంలో త‌న ప్ర‌యాణం మొత్తాన్ని, అందులోని విశేషాల‌ను త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్ ద్వారా అంద‌రికీ తెలియ‌జేస్తున్నాడు. కాగా త‌న ప్ర‌యాణంలో భాగంగా టెక్సాస్ వ‌ద్ద ‘స‌వాన్నా’ అనే పేరున్న ఓ కుక్క‌ను కూడా అత‌ను చేర‌దీశాడు. దాంతో క‌లిసి ఓ ట్రాలీ బ్యాగ్‌ను వెంట బెట్టుకుని టామ్ త‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఆ బ్యాగ్‌లో త‌న‌కు కావ‌ల్సిన వ‌స్తువులు, ఆహారం అన్నీ ఉంటాయి. ఏది ఏమైనా త‌న కాలి న‌డ‌క‌ను పూర్తి చేసి తీరుతాన‌ని ధైర్యంగా చెబుతున్నాడు టామ్‌. ఇంత‌కీ టామ్ కాలి న‌డ‌క ప్ర‌యాణానికి పేరేంటో తెలుసా..? ‘ది వ‌ర‌ల్డ్ వాక్‌’. దీన్ని కూడా అత‌నే పెట్టుకున్నాడు. కాగా టామ్ ప్ర‌యాణం విజ‌య‌వంతం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top