అతను ‘అమ్మ’ అయ్యాడు.. ఎలాగో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.??

టైటిల్ చూసి ఏంటి అనుకుంటున్నారా. అవును మీరు విన్నది నిజమే. అమెరికాలోని టెక్సాస్ కు చెందిన విల్లే సిమ్సన్ మగాడిగా జన్మించాడు. కానీ మహిళగా మారాలనుకున్నాడు. ఏడేళ్ల క్రితం లింగ మార్పిడి చేయించుకుని అమ్మాయిగా మారాడు. అప్పటి నుంచి ప్రియుడు గేగ్ తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. వాళ్ల సహజీవనానికి గుర్తుగా ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకున్నాడు. అయితే అతడి కోరిక నెరవేరే మార్గం కనిపించలేదు. లింగ మార్పిడి చేయించుకున్నంత మాత్రనా గర్భసంచి ఉండదని డాక్టర్లు తేల్చి చెప్పేసారు.


కానీ అనూహ్యంగా విల్లే జీవితంలో వైద్యులు కూడా ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది. ఫిబ్రవరి 2018లో అతనికి నెలసరి రావడం ఆగిపోయింది. అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరకి వెళ్లారు ఆ జంట. విల్లేని పరీక్షించి కొన్ని టెస్టులు చేసారు వైద్యులు. ఆ పరీక్షలలో విల్లే గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్ధారించారు. గర్భం దాల్చడం కోసం ఏ ట్రీట్‌మెంట్ తీసుకోకుండానే ‘అమ్మ’ అయ్యే అవకాశం రావడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు. పుట్టిన ఆడ బిడ్డను చూసి ఆ జంట మురిసిపోతున్నారు.
విల్లే గర్భంతో ఉన్నప్పుడు రోడ్డు మీదకు వస్తే జనం చూసి నవ్వేవారు. కానీ ఇవన్నీ విల్లే పట్టించుకునేవాడు కాదు. ఇష్టమైన పని చేసేటప్పుడు ఎన్ని విమర్శలు ఎదురైనా విల్లేకు బాధ అనిపించలేదు. ఇప్పుడు పుట్టిన పసి పాపతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు.

Comments

comments

Share this post

scroll to top