అత‌ను గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు మెసేజ్ పెడుతున్నాన‌నుకుని క‌న్న తల్లికి మెసేజ్ పెట్టాడు.! చివరికి ఏమైందో తెలుసా.?

ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వ‌స్తున్నా. నా గ‌ర్ల్‌ఫ్రెండ్‌కు వాట్సాప్‌లో మెసేజ్ చేశా. “just left office! Will reach home in a while. Love you! Did you have dinner?” అని మెసేజ్ పంపా. అయితే కొంత సేప‌టికి మా నాన్న కాల్ చేశారు. నువ్వు మీ అమ్మ‌కు ఏమ‌ని మెసేజ్ పెట్టావు. ఆమె ఆనందంతో పొంగి పోతోంది.. అని అడిగారు. అయితే మొద‌ట నేను కొంత కన్‌ఫ్యూజ్ అయ్యా. త‌రువాత ఒక్క నిమిషం ఆగ‌మని నాన్న‌కు చెప్పి నా ఫోన్ ఓపెన్ చేసి అందులో వాట్సాప్ మెసేజ్ చెక్ చేశా. ఒక్క‌సారిగా షాక్ అయ్యా.

నేను ఆ మెసేజ్ పంపింది నా గ‌ర్ల్ ఫ్రెండ్‌కు కాదు, మా అమ్మ‌కు. అయినా అందులో మంచి ఎమోష‌న్ ఉంది క‌నుక అమ్మ అందుకు ఆనందంతో పొంగి పోయింది. నిజానికి ఆమెకు వాట్సాప్ వాడ‌డం రాదు. కొద్ది రోజుల కింద‌టే నేర్పించా. ఇంగ్లిష్ కూడా అమ్మ ఒక్కో అక్ష‌రం ప‌ఠిస్తూ చ‌దువుతుంది. అయినా ఆమె ఇంగ్లిష్‌ను అర్థం చేసుకుంటుంది. దీంతో నేను పంపిన మెసేజ్‌ను ఆమె చ‌దివి ఆనందప‌డింది. నిజంగా త‌న‌కే ఆ మెసేజ్ త‌న కొడుకు పంపాడ‌ని ఆమె సంతోషించింది.

అయితే ఆమె సంతోషాన్ని నేను కాద‌న‌లేక‌పోయాను. అందుకే నేనే ఆ మెసేజ్ పంపా అని చెప్పా. దీంతో అమ్మ మ‌రింత పొంగిపోయింది. వెంట‌నే ఆమె త‌న ఫోన్ నుంచి Gn (గుడ్ నైట్‌) అని మెసేజ్ పెట్టింది. దానికి నేను “I was missing maa..” అని మ‌ళ్లీ మెసేజ్ చేశా. ఆ రాత్రి అలా గ‌డిచింది. ఉద‌యాన్నే లేచి వాట్సాప్ చూసుకునే స‌రికి నాకు అమ్మ నుంచి మ‌రో మెసేజ్ వ‌చ్చింది. “Love you beta! Bhindi teri favoret” (Your favorite). అని మెసేజ్ పెట్టింది. దీంతో నాక్కూడా సంతోషం క‌లిగింది. రోజూ అమ్మ నుంచి అలాంటి మెసేజ్ రావాలని చెప్పి నేను ముందు రోజు రాత్రి అదే పైన చెప్పిన సేమ్ మెసేజ్‌ను పెడుతున్నా. అమ్మ రోజూ నాకు ఉద‌యాన్నే ఓ మెసేజ్ పంపుతోంది. నేను చేసిన ఓ చిన్న మిస్టేక్ చివ‌రకు ఇలా ఓ బ్యూటిఫుల్ మిస్టేక్ అయింది.

Comments

comments

Share this post

scroll to top