రంజాన్ ఉప‌వాసాన్ని బ్రేక్ చేసి మ‌రీ…ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు.!

ఓ నిండు ప్రాణాన్ని కాపాడ‌డం కోసం ఓ ముస్లీం యువ‌కుడు త‌న రంజాన్ ఉప‌వాసాన్ని బ్రేక్ చేసి మ‌రీ ర‌క్త‌ధానం చేశాడు. డెహ్రాడూన్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ చాలా నిష్ట‌తో రంజాన్ ఉప‌వాసాలు కొన‌సాగిస్తున్నాడు. ఈ క్ర‌మంలో త‌న వాట్సాప్ గ్రూప్ కి ఓ మెసేజ్ వ‌చ్చింది. 20 సంవ‌త్స‌రాల అజ‌య్ ప్లేట్ లెట్స్ త‌క్కువ అవ్వ‌డంతో హాస్పిట‌ల్ లో చేరాడు… ర‌క్త‌దాత‌లెవ‌రైనా స్పందిస్తే అత‌డు బ‌తుకుతాడు అని దాని సారాంశం…

మెసేజ్ ను చూసిన ఆరిఫ్ వెంట‌నే కాంటాక్ట్ నెంబ‌ర్ కు కాల్ చేశాడు.. నేను ఉప‌వాసంలో ఉన్నాను..అయిన‌ప్ప‌టికీ ర‌క్త‌మివ్వ‌డానికి నేను రెడీ ఓసారి డాక్ట‌ర్ ను క‌నుక్కొని చెప్పండి..ఓకే అంటే నేను వెంట‌నే బ‌య‌లుదేరి వ‌స్తాన‌ని చెప్పాడు. డాక్ట‌ర్ కూడా ఓకే అన‌డంతో వెంట‌నే హాస్పిట‌ల్ కు చేరుకున్న ఆరిఫ్ త‌న A + ర‌క్తాన్నిచ్చి..20 ఏళ్ళ కుర్రాడిని కాపాడాడు.

Comments

comments

Share this post

scroll to top