మీ వ‌ద్ద పాత నోట్లు ఇంకా ఉన్నాయా..? అయితే రూ.10వేల ఫైన్ ప‌డుతుంది జాగ్ర‌త్త‌..!

నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశంలోని ప్ర‌జ‌లంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్ల‌ను మార్చుకునేందుకు పెద్ద ఎత్తున బ్యాంకులు, పోస్టాఫీసుల వ‌ద్ద బారులు తీరిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కొంద‌రు అక్ర‌మార్కులు గుట్టు చ‌ప్పుడు కాకుండా దొడ్డి దారిన త‌మ వ‌ద్ద ఉన్న నోట్ల‌ను మార్పిడి చేసుకున్నారు. కొంద‌రైతే న‌కిలీ ఖాతాల‌ను తెరిచి మ‌రీ కోట్లాది రూపాయ‌ల డ‌బ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. జ‌నాలు కూడా త‌మ త‌మ బ్యాంకు అకౌంట్లలో పెద్ద ఎత్తున నోట్ల‌ను డిపాజిట్ చేశారు. అయితే… కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న లెక్క‌ల ప్ర‌కారం… నోట్ల మార్పిడి, న‌గ‌దు డిపాజిట్‌ల ద్వారా వ‌చ్చిన నోట్ల సంఖ్య‌కు, అప్ప‌టికే చెలామ‌ణీలో ఉన్న నోట్ల సంఖ్య‌కు చాలా తేడా వ‌చ్చిందని తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఇంకా కొంద‌రు పాత నోట్ల‌ను క‌లిగి ఉన్నార‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే అలాంటి వారికి భారీ షాక్ ఇచ్చేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.

rbi

old-notes-fine-1

ఇక‌పై పాత నోట్లు ఎవ‌రి వ‌ద్ద అయినా 10 కంటే ఎక్కువ ఉంటే ఇక వారి ప‌ని అంతే సంగ‌తులు. అలాంటి వారిపై రూ.10వేల వ‌ర‌కు జ‌రిమానా వేయ‌నున్నారు. అంతేకాకుండా ప‌రిశోధ‌న‌ల నిమిత్తం ఎవ‌రైనా త‌మ వ‌ద్ద 25 నోట్ల క‌న్నా ఎక్కువ పెట్టుకున్నా వారికి కూడా రూ.10వేల‌కు ఫైన్ విధించ‌నున్నారు. అయితే పాత నోట్లు మ‌రీ ఎక్కువ‌గా ఉంటే మాత్రం వారి వ‌ద్ద ఉన్న న‌గదుకు రెట్టింపు మొత్తంలో జ‌రిమానా వేయ‌నున్నారు. విదేశాల్లో ఉన్న‌ట్టు త‌ప్పుగా డిక్ల‌రేష‌న్లు ఇచ్చి నోట్ల‌ను దాచుకున్న వారిపై కూడా కొర‌డా ఝులిపించనున్నారు. అలాంటి వారిపై కూడా ఫైన్ వేయ‌నున్నారు.

old-notes-fine-2

పాత నోట్ల‌ను ఇంకా క‌లిగి ఉంటే అది మ‌న దేశానికి, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావించింది. అందుకే ఈ ఫైన్ నిర్ణ‌యాన్ని తీసుకుంది. దీన్ని చ‌ట్టం రూపంలో అమ‌లులోకి తేనుండ‌గా ఇప్ప‌టికే దీనిపై రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ సంత‌కం చేశారు. మొన్నా మ‌ధ్య జ‌రిగిన పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీన్ని అంద‌రూ ఆమోదించారు కూడా. ఇక ఈ చ‌ట్టం అమ‌లులోకి రావ‌డ‌మే త‌రువాయి. ఇంకా పాత నోట్ల‌ను క‌లిగి ఉన్న‌వారికి ఇక గుబులు పుట్ట‌నుంది. దీంతోనైనా పెద్ద ఎత్తున న‌ల్ల ధ‌నం బ‌య‌టికి వ‌స్తుందా, లేదా అన్న‌ది వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top