మీ చెవిపై ఇలా గాటు ఉందా? ఉంటే జ‌రుగుతుందో తెలుసా..?

మ‌నిషి శరీరంలోని వివిధ అవ‌య‌వాల ఆకారాలను బ‌ట్టి ఆయా వ్య‌క్తుల వ్య‌క్తిత్వాలు, మ‌న‌స్త‌త్వాలు ఎలా ఉంటాయో, వాటిని ఎలా తెలుసుకోవ‌చ్చో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూశాం. అయితే అలా వ్య‌క్తుల మ‌న‌స్త‌త్వాలను తెలియ‌జేసే అవ‌య‌వాల్లో చెవులు కూడా ఉన్నాయి. అది, స‌రే. చెవుల ఆకారాల‌తో ఆ విష‌యం ఎలాగూ తెలుసుకోవ‌చ్చు, కానీ వాటితో అత్యంత ముఖ్య‌మైన ఇంకో విష‌యం కూడా తెలుస్తుంది. అది మ‌న ఆరోగ్యానికి సంబంధించింది. ఇంత‌కీ ఆ విష‌యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌నుషులంద‌రి చెవులు ఒకేలా ఉండ‌వు. కానీ వారి చెవులకు త‌మ్మెలు మాత్రం ఉంటాయి. అయితే ఇవి ఒక్కొక్క‌రిలో ఒక్కో విధంగా ఉంటాయి. కొంద‌రిలో పెద్ద‌గా ఉంటే, మ‌రికొంద‌రిలో చిన్న‌విగా ఉంటాయి. కానీ ఎలా ఉన్నా వాటిపై ముడ‌త‌లు మాత్రం ఉండ‌కూడ‌ద‌ట‌. అలా ఉంటే వారు గుండె సంబంధ వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నార‌ని తెలుసుకోవాల‌ట‌. దీంతోపాటు అలాంటి వారికి భ‌విష్య‌త్తులో హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అయితే ఇది చెవిపై ఉన్న ముడ‌త‌ల‌ను బట్టి ఏదో గాలి వార్త‌గా చెబుతున్న‌ది కాదు. సాక్షాత్తూ వైద్యులే దీని గురించి చెబుతున్నారు.

ear-creases

చెవి త‌మ్మెల‌పై ఉండే ముడ‌త‌ల‌ను ఫ్రాంక్ గుర్తుల‌ని పిలుస్తారట‌. ఎందుకంటే వాటిని ఫ్రాంక్ అనే వైద్యుడు తొలుత గుర్తించాడ‌ట‌. 1973లో డాక్ట‌ర్ ఫ్రాంక్ అనే అత‌ను చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు ఉండే వారికి గుండె సంబంధిత వ్యాధులు వ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉన్న‌ట్టు గుర్తించాడ‌ట‌. ఇందుకోసం అత‌ను ఓ ప్ర‌యోగాన్ని కూడా చేశాడ‌ట‌. 60 మందిని ఎ, బి అనే రెండు గ్రూపులుగా విభ‌జించాడ‌ట‌. అందులో ఎ గ్రూపు స‌భ్యుల‌కు చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు లేవ‌ట‌. బి గ్రూపు స‌భ్యుల‌కు చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు ఉన్నాయ‌ట‌. అలా వారిని రెండు గ్రూపులుగా విభజించిన అనంత‌రం కొన్ని రోజుల పాటు ప‌రీక్షించాడు డాక్ట‌ర్ ఫ్రాంక్‌. అనంత‌రం అత‌నికి తెలిసిందేమిటంటే చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు లేని ఎ గ్రూపు స‌భ్యుల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని, బి గ్రూప్ సభ్యుల‌కు గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు 70 శాతం ఎక్కువ‌గా అవ‌కాశం ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో చెవి త‌మ్మెల‌పై ముడ‌తలు ఉండే వారికి గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని అప్ప‌టి నుంచి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. చెవికి ద‌గ్గ‌ర‌లో ఉండే ర‌క్త నాళాల్లో కొవ్వు వంటి అడ్డంకులు ఏవైనా ఉంటే చెవి త‌మ్మెల‌పై అలా ముడ‌త‌లు వస్తాయ‌ని కూడా సైంటిస్టులు ధృవీక‌రించారు. కాబ‌ట్టి చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు ఉంటే అది ఎవ‌రికైనా అపాయ‌క‌ర‌మేన‌ని గుర్తించాలి.

artery

అయితే బెక్‌విత్ వైడ్‌మాన్ సిండ్రోమ్ అనే ఓ జెనిటిక్ డిజార్డ‌ర్ వ‌ల్ల కూడా చెవి త‌మ్మెల‌పై ముడ‌తలు వ‌స్తాయ‌ట‌. కానీ ఇది చాలా అత్యంత అరుదుగా సంభ‌వించే వ్యాధి కాబ‌ట్టి ఎవ‌రికైనా చెవి త‌మ్మెల‌పై ముడ‌త‌లు వ‌స్తున్నాయంటే వారికి త్వ‌ర‌లో హార్ట్ ఎటాక్స్ రాబోతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి. దీంతో ముందుగానే జాగ్ర‌త్త‌ప‌డి మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. నిత్యం వ్యాయామం చేయ‌డం, స‌రైన పౌష్టికాహారం తీసుకోవ‌డం త‌దిత‌ర ప‌నుల‌తో గుండె ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు. అదేవిధంగా Strauss drops అని పిల‌వబ‌డే డ్రాప్స్ మ‌న‌కు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడితే గుండె సంబంధిత వ్యాధుల‌ను రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు, ర‌క్త‌నాళాల్లో ఉన్న అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయి ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

Comments

comments

Share this post

scroll to top