లీకైన కొత్త బిగ్ బాస్ హౌస్ 7 ఫోటోస్.!! నెక్ట్స్ లెవ‌ల్లో ఉండ‌బోతున్న బిగ్ బాస్ షో.!!

మొన్నా మ‌ధ్య వ‌ర‌కు తెలుగు టీవీ ప్రేక్ష‌కులు బిగ్ బాస్ సీజ‌న్ 1 షోను బాగానే ఎంజాయ్ చేశారు. 70 రోజుల పాటు షో జ‌ర‌గ్గా అందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌తో క‌లిపి మొత్తం 16 మంది పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో రోజులు గ‌డుస్తున్న కొద్దీ షోలో ఉత్కంఠ ఎక్కువైంది. చివ‌ర‌కు ఫైన‌ల్ అయి శివ‌బాలాజీ విన్న‌ర్ అయ్యారు. అంతా అయిపోయింది. మ‌రిక విష‌యం ఏమిటంటే… ఏమీలేదండీ.. నిజానికి మ‌న తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పుడే ప్రారంభ‌మైనా హిందీలో ఎప్పుడో షురూ అయింది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆ భాష‌లో సీజ‌న్ 11 కూడా ఆరంభ‌మైంది. దీనికి కూడా స‌ల్మానే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే హిందీలో బిగ్‌బాస్ సీజ‌న్ 11 కు సంబంధించిన బిగ్ బాస్ ఇల్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఆ ఇంటికి చెందిన ప‌లు ఫొటోలు ప్ర‌స్తుతం నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

గార్డెన్ ఏరియా

బాత్‌రూం

బెడ్ రూం

హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11 ఇంటి సెట్‌ను ప్ర‌ముఖ ఆర్ట్ డైరెక్ట‌ర్ ఓమంగ్ కుమార్ డిజైన్ చేశారు. ఆయ‌న త‌న భార్య వ‌నిత‌తో క‌లిసి ఆ ఇంటి ఇంటీరియ‌ర్‌ను తీర్చిదిద్దారు. తెలుగు బిగ్‌బాగ్ హౌస్‌తో పోలిస్తే హిందీ బిగ్ బాస్ హౌస్‌ను మ‌రింత క‌ల‌ర్ ఫుల్ గా, వైబ్రెంట్‌గా తీర్చిదిద్దారు. పాప్ ఆర్ట్ అనే కాన్సెప్ట్‌తో ఇంటిని నిర్మించారు. అయితే దీన్ని నిర్మించేందుకు 55 రోజుల టైం ప‌ట్టింది. అందుకు 200 మంది బృందం నిరంత‌రాయంగా పనిచేశారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

క‌న్‌ఫెష‌న్ రూం

కిచెన్

లివింగ్ ఏరియా

హిందీ బిగ్‌బాస్ సీజ‌న్ 11 హౌస్‌లో 90 కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఇల్లు మొత్తం 19,500 చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. 100 రోజుల పాటు ఇందులో కంటెస్టెంట్లు ఉంటారు. ఇక గార్డెన్‌, లివింగ్ ఏరియా, బాత్ రూం, జైలు, జిమ్ వంటి స‌దుపాయాలు అన్నీ ఈ ఇంటిలోనూ ఉన్నాయి. అయితే ఈ ఇంటిని భూగ‌ర్భంలో నిర్మించిన‌ట్టు తెలిసింది..! చూశారుగా.. హిందీ బిగ్‌బాస్ హౌస్ ఎలా ఉంది..!

Comments

comments

Share this post

scroll to top