జీఎస్‌టీతో కూడిన బిల్లు చూశారా..? రెండు GST లు కట్టాలి..అంతే కాకుండా “3 వ”ది కూడా ఉంది! ఏది ఎప్పుడంటే..?

జీఎస్‌టీ… గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్‌.. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమ‌లులోకి వ‌చ్చింది. ఈ క్రమంలో కొన్ని వస్తువులు, సేవ‌ల పై ట్యాక్స్ త‌గ్గ‌నుంది. కొన్నింటిపై పెర‌గ‌నుంది. అయితే ఓవ‌రాల్‌గా చూసుకుంటే జీఎస్‌టీ వ‌ల్ల లాభ‌మా, న‌ష్ట‌మా అనే విష‌యాన్ని ఎవ‌రూ కూడా స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఇదిలా ఉండ‌గా, జూలై 1వ తేదీన ప‌లు వ‌స్తువులు కొని, సేవ‌లను పొందిన వారు బిల్స్ తీసుకుంటే వాటిలో జీఎస్‌టీ క‌లిపి ఉంది. అంత‌కు ముందు ఉన్న ట్యాక్స్‌ల స్థానంలో కొత్త‌గా రెండు ట్యాక్స్‌లు వ‌చ్చాయి. అవి ఒక‌ట స్టేట్ జీఎస్టీ, రెండోది సెంట్ర‌ల్ జీఎస్‌టీ. ప్ర‌స్తుతం ఇచ్చే బిల్స్‌లో ఇవి రెండే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో ప‌లువురు యూజ‌ర్లు తాము తీసుకున్న లేటెస్ట్ బిల్స్ తాలూకు ర‌శీదుల‌ను షేర్ చేస్తున్నారు. వాటిపై ఓ లుక్కేద్దామా..!

చూశారుగా.. బిల్స్ ఎలా ఉన్నాయో. ఏది తీసుకున్నా బిల్ ర‌శీదులో ట్యాక్స్ స్థానంలో స్టేట్‌, సెంట్ర‌ల్ అని చెప్పి రెండు జీఎస్‌టీల‌ను వ‌సూలు చేస్తున్నారు. అయితే ఓ వ్య‌క్తి జీఎస్‌టీ లేక ముందు రెండు ఫుడ్స్‌ను హోట‌ల్ లో తిన‌గా ఎంత బిల్లు వ‌చ్చిందో దాని ర‌శీదును, జీఎస్‌టీ అమ‌ల‌య్యాక మ‌ళ్లీ అవే ఫుడ్స్‌కు బిల్లులో వచ్చిన ట్యాక్స్‌ను, వాటి తాలూకు ర‌శీదుల‌ను షేర్ చేశాడు. ఈ క్రమంలో జీఎస్టీ క‌న్నా ముందు అమలైన ట్యాక్స్ వ‌ల్ల స‌ద‌రు ఫుడ్స్‌కు బిల్లు రూ.133 మాత్ర‌మే అయింది. జీఎస్‌టీ అమ‌ల‌య్యాక వ‌చ్చిన బిల్లులో అవే ఫుడ్స్‌కు రూ.148 దాకా అయింది. అంటే రూ.15 ఎక్కువైంది. అయితే అన్నింటికీ ఇలా ఉండ‌క‌పోవ‌చ్చు. కొన్నింటికి ముందు పెరిగి ఇప్పుడు త‌గ్గి ఉండ‌వ‌చ్చు.

ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం #trystwithGST పేరిట ట్విట్ట‌ర్‌లో ఓ హాష్ ట్యాగ్‌ను న‌డుపుతోంది. ఆ ట్యాగ్‌కు ప్ర‌జ‌లు తాము తాజాగా తీసుకున్న బిల్లుల‌ను షేర్ చేస్తూ త‌మ అభిప్రాయాల‌ను తెల‌పాల‌ని కేంద్రం కోరుతోంది. జీఎస్‌టీ ఉన్న బిల్లుల‌ను యూజ‌ర్లు ట్విట్ట‌ర్ ముందు చెప్పిన హాష్‌ట్యాగ్‌కు షేర్ చేసి త‌మ అభిప్రాయాల‌ను తెల‌ప‌వ‌చ్చు. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే చాలా మంది జీఎస్‌టీ ఉన్న తాము తీసుకున్న తాజా బిల్లుల‌ను షేర్ చేస్తున్నారు..! ఏది ఏమైనా అస‌లు దీని వ‌ల్ల లాభ‌మా, న‌ష్టమా అనేది తెలియాలంటే మ‌రి కొంత కాలం ప‌ట్ట‌వ‌చ్చు..!

స్టేట్, సెంట్రల్ కాకుండా “IGST ” అని మరొకటి కూడా ఉంది. అదే ఇంటిగ్రేటెడ్ జి.ఎస్.టి. ఇతర రాష్ట్రాల్లో తయారైన వస్తువుని మన రాష్ట్రంలో కొంటే ఈ టాక్స్ వర్తిస్తుంది.

SGST – State Goods And Services Tax

CGST – Central Goods And Service Tax

IGST – Integrated Goods And Service Tax

Comments

comments

Share this post

scroll to top