ఫోన్, డిజిటల్ డివైస్ లలో ఉండే గొంతు “మహిళల”దే ఎందుకుంటుందో తెలుసా..? కారణాలు ఇవే..!

Azhar

ఆండ్రాయిడ్, ఐఫోన్ లేదా విండోస్ ఫోన్‌ల‌లో డిజిట‌ల్ అసిస్టెంట్ ఫీచ‌ర్ ఉంటుంది తెలుసు క‌దా. ఆండ్రాయిడ్‌లో అయితే దాన్ని గూగుల్ అసిస్టెంట్ అంటారు. అదే ఐఫోన్‌లో అయితే సిరి (Siri) అని, విండోస్ ఫోన్‌లో అయితే కార్టానా (Cortana) అని ఆ డిజిట‌ల్ అసిస్టెంట్ల‌ను పిలుస్తారు. వీటికి మ‌నం ఆదేశాలు ఇవ్వ‌వ‌చ్చు. ఫ‌లానా వారికి కాల్ క‌ల‌ప‌మ‌నో, మెసేజ్ పెట్ట‌మ‌నో, అలారం ఫిక్స్ చేయ‌మ‌నో లేదంటే ఫ‌లానా విష‌యాన్ని నెట్‌లో వెద‌క‌మ‌నో… ఇలా ర‌క ర‌కాలుగా మ‌నం ఈ డిజిటల్ అసిస్టెంట్ల‌కు వాయిస్ కమాండ్ల‌ను ఇవ్వ‌వచ్చు. దీంతో ఆయా ప‌నులు వేగంగా పూర్త‌వుతాయి. అయితే ఇంత వ‌ర‌కు ఓకే. కానీ వీటి విష‌యానికి వ‌చ్చే స‌రికి వీట‌న్నింటిలో కామ‌న్‌గా ఉన్న ఓ విష‌యాన్ని మీరెప్పుడైనా గ‌మ‌నించారా..? అదేనండీ ఈ డిజిటల్ అసిస్టెంట్ల‌న్నీ మాట్లాడ‌తాయి క‌దా, అవును. మరి ఆ వాయిస్ ఎవ‌రిది ఉంటుంది..? లేడీస్ వాయిస్ ఉంటుంది. అవును అదే. ఏ డిజిట‌ల్ అసిస్టెంట్‌ను తీసుకున్నా అందులో లేడీ వాయిస్ మ‌న‌కు వినిపిస్తుంది. మ‌రి ఇలా లేడీ వాయిస్‌నే వీటిలో పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటో తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక‌ప్పుడు.. అంటే… 1878వ సంవ‌త్స‌రంలో వినియోగ‌దారుల కాల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు ఒక మ‌గ టెలిఫోన్ ఆప‌రేట‌ర్‌ను ఓ కంపెనీ పెట్టింద‌ట‌. అయితే ఆ ఆప‌రేట‌ర్‌ చాలా దురుసుగా, క‌ఠినంగా వినియోగ‌దారుల‌తో మాట్లాడేవాడ‌ట‌. దీంతో వినియోగ‌దారులు అత‌నిపై కంప్లెయింట్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో అత‌న్ని తొల‌గించేసి ఎమ్మా న‌ట్ అనే ఓ మ‌హిళ‌ను టెలిఫోన్ ఆపరేట‌ర్‌గా పెట్టారు. దీంతో ఆమె చక్క‌ని వాయిస్‌కు వినియోగ‌దారులు ముగ్దుల‌య్యారు. ఇక అప్ప‌టి నుంచి చాలా కంపెనీలు టెలిఫోన్ ఆప‌రేట‌ర్లు, రిసెప్ష‌నిస్టు ఉద్యోగాల‌ను మ‌హిళ‌ల‌కే ఇవ్వ‌డం ప్రారంభించాయి. ఎందుకంటే వారి వాయిస్‌కు ఇట్టే జ‌నాలు ఆక‌ర్షితుల‌య్యేవార‌ట‌. అలా అలా అది ప్రాచుర్యంలోకి రావ‌డంతో ఇక చాలా వ‌ర‌కు వాయిస్ సేవ‌ల్లోనూ మ‌హిళా గొంతును పెట్ట‌డం ప్రారంభించారు.

ఇక ఫోన్‌ల‌లో డిజిట‌ల్ అసిస్టెంట్ల‌లో మ‌హిళ‌ల వాయిస్‌ను పెట్టేందుకు గ‌ల మ‌రో కార‌ణం ఏమిటంటే… మ‌గ‌వారి గొంతు క‌న్నా ఆడ‌వారి గొంతు హై పిచ్ తో ఉంటుందట‌. వారి గొంతు స్ప‌ష్టంగా వినిపిస్తుంద‌ట‌. టెలిఫోన్‌లో మాట్లాడినా చాలా క్లియ‌ర్ గా ఆడ‌వారి గొంతు విన‌ప‌డుతుంద‌ట‌. దీనిపై ఓ సైంటిస్టు ప్ర‌యోగాలు చేశార‌ట‌. ఈ క్ర‌మంలో ఆడ‌వారి గొంతు అయితేనే మ‌గ‌వారు, ఆడ‌వారు యాక్టివ్ అవుతారని కూడా ఆ సైంటిస్టు తేల్చారు. దీంతో అనేక ర‌కాల వాయిస్ ఆప‌రేటెడ్ ప‌రిక‌రాల‌తోపాటు ఫోన్ల‌లో డిజిట‌ల్ అసిస్టెంట్ల‌లో మ‌హిళా గొంతును పెట్ట‌డం ప్రారంభించారు. అందుకే ఆ గొంతులు అప్ప‌టి నుంచి మ‌హిళ‌ల‌వే ఉంటున్నాయి. అయితే 1990ల‌లో బీఎండ‌బ్ల్యూ కంపెనీకి మాత్రం ఓ కంపెనీ నుంచి చిత్ర‌మైన ఆర్డ‌ర్ వ‌చ్చిందట‌. త‌మ కంపెనీకి కేవ‌లం మ‌గ గొంతు వాయిస్ అసిస్టెంట్ ఉండే కార్లే కావాల‌ని ఓ కంపెనీ బీఎండ‌బ్ల్యూ కంపెనీని సంప్ర‌దించిందట‌. దీంతో ఆ కార్ కంపెనీ త‌మ కార్ల‌లో లేడీ గొంతుకు బ‌దులుగా మ‌గ‌వారి గొంతుతో కూడిన వాయిస్ అసిస్టెంట్‌ను అమర్చి ఆ కంపెనీకి ఇచ్చిందట‌. అయితే ఆ కంపెనీ అలా మ‌గ గొంతుతో కూడిన వాయిస్ అసిస్టెంట్ కార్ల‌నే ఎందుకు కావాల‌ని అడిగిందో ఇప్ప‌టికీ తెలియ‌దు. ఏది ఏమైనా ఫోన్ల‌లో ఉండే డిజిట‌ల్ అసిస్టెంట్ గొంతుగా లేడీ వాయిస్‌నే ఎందుకు పెట్టారో ఇప్పుడు తెలిసిందిగా..!

Comments

comments