ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టు మ్యాచ్‌లు ఆడేట‌ప్పుడు స్టేడియంలో క‌నిపించిన ఈ యువ‌తిని గుర్తు ప‌ట్టారా ? ఆమె ఎవ‌రో తెలుసా..?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌.. ఐపీఎల్‌.. 10 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఈ లీగ్‌కు ఉంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన లీగ్‌ల‌లో ఐపీఎల్‌లో టాప్ పొజిష‌న్‌లో ఉంటుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 11వ సీజ‌న్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌ట్ల‌న్నీ ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకునేందుకు పోటీ ప‌డుతున్నాయి. దీంతో ఆ జ‌ట్ల‌కు చెందిన సెలెబ్రిటీలు, ప్రాంచైజీల య‌జమానులు స్వ‌యంగా తమ జ‌ట్లు ఆడే మ్యాచ్‌ల‌కు వ‌చ్చి ప్లేయ‌ర్ల‌లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక చెన్నై, ఆర్‌సీబీ జ‌ట్ల గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. చెన్నై జ‌ట్టు కెప్టెన్ ధోని భార్య సాక్షి, ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శ‌ర్మ‌లు కూడా ప్ర‌తి మ్యాచ్‌లోనూ క‌నిపించి త‌మ భ‌ర్త‌ల‌కు, అదేవిధంగా జ‌ట్టుకు ప్రేర‌ణ‌నిస్తున్నారు. అయితే చెన్నై జ‌ట్టు ఆడుతున్న‌ప్పుడల్లా ధోనీ భార్య సాక్షితోపాటు మ‌రో యువ‌తి కూడా ఈ మ‌ధ్య కాలంలో బాగా క‌నిపిస్తూ వ‌స్తోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రో తెలుసా..?

ఆమె పేరు మాల‌తి చాహ‌ర్‌. ఈమె చెన్నై జ‌ట్టులో ఉన్న ప్లేయ‌ర్ దీప‌క్ చాహ‌ర్‌, ముంబై జ‌ట్టులో ఉన్న ప్లేయ‌ర్ రాహుల్ చాహ‌ర్‌ల సోద‌రి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అందుకే ఈమె ఎక్కువ‌గా త‌న సోద‌రుల టీంలు ఆడే మ్యాచ్‌ల‌కు వ‌చ్చి వారిని ఉత్సాహ ప‌రుస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే మాలతి ఈ మ‌ధ్య కాలంలో చెన్నై జ‌ట్టు ఆడే మ్యాచ్‌ల‌కు ఎక్కువ‌గా వ‌చ్చి త‌న సోద‌రుడు దీప‌క్‌కు ఉత్సాహాన్ని, ప్రేర‌ణ‌ను ఇస్తోంది. అయితే స్టేడియంలో కెమెరా క‌ళ్లు ఊరుకోవు క‌దా. వెంట‌నే ఆమెను ప‌ట్టేశాయి.

అలా కొన్ని మ్యాచ్‌ల సంద‌ర్భంగా మాల‌తీ చాహ‌ర్ స్టేడియంలో క‌నిపించింది. చెన్నై జ‌ట్టు ఆడుతున్న‌ప్పుడు ఆమె ఎక్కువ‌గా కెమెరాకు చిక్కింది. దీంతో ఆమె ఎవ‌రోన‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌గా చివ‌ర‌కు ఆమె గురించిన వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం మాల‌తి ఫొటోలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఆమె కేవ‌లం మ్యాచ్‌ల‌ప్పుడు మాత్రమే కాదు, మ్యాచ్‌లు లేని స‌మ‌యంలోనూ చెన్నై ఆట‌గాళ్ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతుంటుంది. వాళ్ల‌తో క్రికెట్ ఆడ‌డం, డ్యాన్సులు చేయ‌డంతోపాటు కెప్టెన్ ధోని స‌హా ఇత‌ర ప్లేయ‌ర్లంద‌రితోనూ ఆమె ఫొటోలు కూడా దిగి వాటిని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఆమెకు విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. మ‌రి ఈ ఫాలోయింగ్‌తో ఆమె ఏం చేస్తుందో చూడాలి..! అన్న‌ట్లు.. ఆమెను ఫొటోల్లో చూశారు క‌దా. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని గ్లామ‌ర్‌తో ఆమె ఉంది. చూద్దాం మ‌రి.. త‌న సోద‌రుల ద్వారా త‌న‌కు వ‌చ్చిన ప‌బ్లిసిటీని ఆమె ఎలా వాడుకుంటుందో..!

 

Comments

comments

Share this post

scroll to top