కోహ్లీ కూడా సంక్రాంతి హీరోనే… మూడేళ్లుగా సెంచరీలు ఒకే తేదీన కొట్టిన హ్యాట్రిక్ క్రికెటర్!!

రికార్డుల మొనగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా మూడు సంవత్సరాలు ఒకే తేదీన సెంచరీ కొట్టాడు. అలా మూడు సంవత్సరాలు మూడు సెంచరీలు ఒకే తేదీన కొట్టిన హ్యాట్రిక్ క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఆడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో మంగ‌ళ‌వారం జ‌రిగిన వ‌న్డే మ్యాచ్‌ లో సెంచరీ చేయడంతో రికార్డు దక్కింది.


2017 జ‌న‌వ‌రి 15వ తేదీన భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య పుణె వేదిక‌గా వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌ లో కోహ్లీ 105 బాల్స్ లో 122 రన్స్ చేసి, టీమిండియాకు విజ‌యాన్ని అందించాడు. 2018 జ‌న‌వ‌రి 13వ తేదీన‌ సెంచూరియ‌న్ వేదిక‌గా సౌతాఫ్రికా, టీమిండియా మ‌ధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. ఆ మ్యాచ్ మూడో రోజున అంటే జ‌న‌వ‌రి 15వ తేదీన కోహ్లీ సెంచరీ సాధించాడు. 153 రన్స్ చేశాడు. అయితే ఆ మ్యాచ్‌ లో భార‌త్ ఓడిపోయింది. 2019 జ‌న‌వ‌రి 15వ తేదీన ఆడిలైడ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌ లో 104 రన్స్ చేసి భార‌త్ బిగ్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు.

ఇలా మూడేళ్లుగా జ‌న‌వ‌రి 15వ తేదీన క‌చ్చితంగా సెంచరీ సాధిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు ఈ పరుగుల యంత్రం. ఈ ఏడాది ఫస్ట్ సెంచరితో కోహ్లీ కెరీర్‌ లో 39వ సెంచ‌రీ సాధించాడు. ఈ అరుదైన రికార్డు దక్కించుకున్న కోహ్లీపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. మామూలుగా సంక్రాంతికి సినీ హీరోలు హిట్ కొడుతారు. బాక్సాఫీస్ లు బద్దలు కొడుతారు కానీ..విరాట్ కూడా సంక్రాంతికి సెంచరీలతో దుమ్ము దులుపుతున్నాడని..ఈ జోరు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tweet:

Comments

comments

Share this post

scroll to top