జాబ్‌లో భాగంగా హ‌స్త ప్ర‌యోగం చేసుకుంటే ఆ కంపెనీ ఏటా రూ.23 ల‌క్ష‌ల జీతం ఇస్తుంద‌ట తెలుసా..!

జాబ్ అంటే అలాంటి ఇలాంటి జాబ్ కాదు. చాలా సుఖ‌వంత‌మైన జాబ్. దాని గురించే ఇప్పుడు మేం చెప్ప‌బోతున్నాం. వారంలో రెండు రోజులు ఇంట్లో, మూడు రోజులు ఆఫీసులో ఉండి జాబ్ చేయ‌వ‌చ్చు. మిగిలిన రెండు రోజులు సెల‌వే. దీనికి తోడు ప్ర‌త్యేక‌మైన అల‌వెన్సులు, ఫ్రీ ట్రావెల్ ప్యాకేజీలు, హెల్త్ ఇన్సూరెన్స్‌, బ‌ర్త్ డే రోజున పెయిడ్ లీవ్.. వంటి ఎన్నో స‌దుపాయాలు ఈ జాబ్‌తో ఉద్యోగికి ల‌భిస్తాయి. అయితే ఇంకెందుకాల‌స్యం… వెంట‌నే దానికి అప్లై చేద్దాం అనుకుంటున్నారా..? అయితే ముందు మేం చెప్ప‌బోయేది తెలుసుకోండి. ఆ త‌రువాతే జాబ్‌కు అప్లై చేయండి. ఇంత‌కీ ఆ జాబ్ ఏమిటంటే…

సెక్స్ టాయ్ రివ్యూయ‌ర్‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. సెక్స్ టాయ్ ల‌ను రివ్యూ చేసే జాబ్ అది. అది లండ‌న్‌కు చెందిన LoveWoo అనే కంపెనీ. ఆ కంపెనీ సెక్స్ టాయ్‌ల‌ను, లింగ‌రీల‌ను త‌యారు చేస్తుంది. అయితే ఇప్పుడదే కంపెనీ పురుషుల కోసం ముందు చెప్పిన ఆ జాబ్‌ను ఆఫ‌ర్ చేస్తోంది. ఇంత‌కీ ఈ జాబ్‌లో ఏం చేయాలంటే… ఈ కంపెనీ అందించే సెక్స్ టాయ్‌లు, వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌ను వేసుకుని, వీలైతే ట్రై చేసి (ఆ సంద‌ర్భంలో అవ‌స‌రం అయితే హ‌స్త ప్ర‌యోగం కూడా చేయాల్సి రావ‌చ్చు) దానికి సంబంధించిన జెన్యూన్ రివ్యూను రాయాల్సి ఉంటుంది.

ఏంటీ షాక్ అయ్యారా..! అవును, మీరు షాకైనా ఇది నిజ‌మే. ఇందుకు గాను పైన చెప్పిన స‌దుపాయాల‌తోపాటు ఏడాదికి 28వేల పౌండ్ల జీతం వ‌స్తుంది. అంటే మ‌న క‌రెన్సీలో అక్ష‌రాలా రూ.23 ల‌క్ష‌లన్న‌మాట‌. అయితే ఈ జాబ్‌ను ఇంట్లో కూడా చేసుకోవ‌చ్చు. అందుకు గాను వారంలో రెండు రోజుల పాటు వెసులుబాటు క‌ల్పిస్తారు. 3 రోజులైతే త‌ప్ప‌నిస‌రిగా ఆఫీస్‌కు వెళ్లాలి. ఇక ఈ జాబ్‌కు దర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఉంది. అయితే ద‌ర‌ఖాస్తులో అభ్య‌ర్థి త‌న రెజ్యూమ్‌ను పేపర్ రూపంలో లేదా వీడియో రూపంలో ప్ర‌జెంట్ చేయ‌వ‌చ్చు. కానీ దాంతోపాటు తాను రివ్యూ చేసిన ఏదైనా ఓ సెక్స్ టాయ్ గురించి అందులో పేర్కొనాలి. తాను ఆ జాబ్‌కు క‌చ్చితంగా సరిపోతాన‌ని రెజ్యూమ్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ జాబ్ నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ..!

Comments

comments

Share this post

scroll to top