రెగ్యుల‌ర్‌గా “హస్తప్ర‌యోగం” చేస్తున్నారా.? అయితే 6 విషయాలు తప్పక తెలుసుకోండి.! లేదంటే.?

పురుషులు త‌మ‌లో క‌లిగే శృంగార వాంఛ‌ల‌ను అదుపు చేసుకోలేక‌పోతే అప్పుడు వారు ఎంచుకునే ద‌గ్గ‌రి మార్గం.. హ‌స్త ప్ర‌యోగం.. ఒక ర‌కంగా చెప్పాలంటే హ‌స్త ప్ర‌యోగం మంచిదే అని వైద్యులు అంటారు. దీని వ‌ల్ల మాన‌సిక ఒత్తిడి తొల‌గిపోతుంద‌ట‌. శ‌రీరానికి ప్ర‌శాంతత క‌లుగుతుంద‌ట‌. శ‌రీరం ఉత్తేజం చెందుతుంద‌ని డాక్ట‌ర్లు అంటారు. అయితే అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్.. (ఏ విష‌యంలోనూ అతి ప‌నికిరాదు) అన్న‌ట్టుగా.. హ‌స్త ప్ర‌యోగం విష‌యంలోనూ అతి ప‌నికి రాదు. దీన్ని అతిగా చేస్తే అది వ్య‌స‌నం అవుతుంది. వారానికి 3 నుంచి 7 సార్లు హ‌స్త ప్ర‌యోగం చేయ‌వ‌చ్చు. కానీ అంత‌కు మించి హ‌స్త ప్ర‌యోగం చేస్తే దాన్ని వ్య‌స‌నం అనే అంటారు.

హ‌స్త ప్ర‌యోగం ఎక్కువ‌గా చేస్తే పుండ్లు ఏర్ప‌డుతాయ‌ట‌. పురుషులు, మ‌హిళలలో జనేంద్రియాల వాపు వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాక క్రమం తప్పకుండా హస్త ప్రయోగం చేయుట వలన వీర్యకణాల సంఖ్య తగ్గుతుంది. పురుషుల్లో వీర్యం ఉత్పత్తి కూడా కష్టమవుతుంది. ఇక అధిక హస్త ప్రయోగం వ్య‌క్తుల లైంగిక జీవితం మీద ప్రభావితం చూపుతుంది. దీంతో అకాల స్ఖలనం అనే స‌మ‌స్య‌కు అది దారితీస్తుంది. అయితే హ‌స్త ప్ర‌యోగం వ్య‌స‌నంగా మారిన వారు దాన్నుంచి బ‌య‌ట ప‌డేందుకు కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే…

1. హ‌స్త ప్ర‌యోగం చేయాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా ఒక కొత్త ప‌ని చేయండి. కొత్త విష‌యాల ప‌ట్ల ఆస‌క్తిని పెంచుకోండి. అది మిమ్మ‌ల్ని ఆ అల‌వాటుకు దూరం చేస్తుంది.

2. రోజూ వ్యాయామం చేయండి. ముఖ్యంగా స్విమ్మింగ్ వంటివి చేయాలి. బాడీ బిల్డింగ్ చేస్తే ఇంకా మంచిది. ఇవి మీ మూడ్‌ను మారుస్తాయి. చెడు వ్య‌స‌నాల నుంచి దూరం చేస్తాయి.

3. ఫుట్ బాల్, త్రో బాల్, బాస్కెట్ బాల్ వంటి క్రీడలను ఆడాలి. ఈ క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి.

4. వీలైనంత వ‌ర‌కు ఒంట‌రిగా ఉండ‌వ‌ద్దు. ఒంట‌రిగా ఉంటే ఆ ఆలోచ‌న‌లే వ‌స్తాయి. క‌నుక న‌లుగురిలోనూ తిరిగేందుకు య‌త్నించాలి. ఇది ఆ అల‌వాటు నుంచి మిమ్మ‌ల్ని దూరం చేస్తుంది.

couple

5. ఆల‌స్యంగా నిద్ర‌పోయే వారు అశ్లీల వీడియోల‌ను ఎక్కువ‌గా చూస్తార‌ట‌. క‌నుక మీరు ఆల‌స్యంగా నిద్రించ‌కండి. త్వ‌ర‌గా నిద్ర‌పోయి త్వ‌ర‌గా మేల్కొనే అల‌వాటు చేసుకోండి. దీంతో హ‌స్త ప్ర‌యోగం వ్య‌స‌నం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే అశ్లీల వీడియోల‌ను చూడ‌డం మానేయండి.

6. కామిక్ బుక్స్‌, చ‌క్క‌ని క‌థ‌లు చ‌ద‌వ‌డం, తోట ప‌ని, వీడియో గేమ్స్ ఆడ‌డం, చిన్నారుల‌తో ఆడుకోవ‌డం, బొమ్మ‌లు గీయ‌డం, ఆధ్యాత్మిక‌త వైపు మ‌ళ్ల‌డం, ధ్యానం చేయ‌డం.. త‌దిత‌ర ప‌నుల‌ను చేసినా చాలు, హ‌స్త ప్ర‌యోగం వ్య‌స‌నం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top