అతడికి 20, ఆమెకు 27….హార్ట్ ను టచ్ చేసిన ఫీల్ గుడ్ లవ్ స్టోరి.!!

నేను చూసేది షార్ట్ ఫిల్మేనా అని నమ్మలేని  ఫీలింగ్,  షార్ట్ ఫిల్మ్ లో సమంత యాక్ట్ చేసిన అనుభూతి. ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి మెలొడీస్ ..అన్నీ కలిసిన ఈ  షార్ట్ ఫిల్మ్ , ఈ మధ్యకాలంలో వెండితెర మీద చూసిన  సినిమాల కంటే ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. ఓ ఫీల్ గుడ్ మూవీ చూస్తున్న అనుభూతి కలిగింది.  స్టోరి లైన్, యాక్టింగ్, డైలాగ్స్.. మ్యూజిక్ ఒకదానితో ఒకటి పోటీ పడితే వచ్చే అవుట్ పుట్ ఎలా ఉంటుందనేదానికి ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఫిల్మ్. కాదు.. కాదు.. స్వీట్ ఫిల్మ్.

రెండున్నర గంటల సినిమాను మూడు మాస్ పాటలు,నాలుగు నాన్ వెజ్ జోకులు, దబిడదిబిడ ఫైటింగ్ లతో ముగించే  ఈ రోజుల్లో… ఓ షార్ట్ ఫిల్మ్ ను ఇంత అందంగా తీయడం, అంతకంటే అందంగా చూపించడం నిజంగా అద్భుతమే. ప్రతి ప్రేమికుడి మనసులోని భావాలను సున్నితంగా సృషించాడు  దర్శకుడు. జోక్స్ కూడా క్యారెక్టర్ తో పాటు క్యారీ అయినవే కానీ ఎక్కడా అతికించినట్టు కనబడవు. వెకిలి చేష్టలు,  వల్గర్ మాటలు ఎక్కడా కనబడలేదు, వినబడలేదు.

లవ్ బ్రేక్ అప్ అయిన  ….తన కంటే 7 యేళ్లు పెద్దదైనా ఆమ్మాయిని  ప్రేమించి, తన లవ్ ను సక్సెస్ చేసుకున్న మనోజ్ అనే 20 యేళ్ల కుర్రాడి కథే హ్యాపీ ఎండింగ్. సినిమాకు డైలాగ్స్ అండ్ సర్పం క్యారెక్టర్ మరింత క్యాచీ నెస్ ను తీసుకొచ్చాయ్ . అందానికి కెరాఫ్ అడ్రస్ గా హీరోయిన్, అభినయనానికి  పర్యాయపదంలా హీరో.. సైడ్ క్యారెక్టర్  సప్తగిరి కి కజిన్ లా సర్పం, అప్పుప్పుడు  సర్పాన్ని  హింసించే  షీలా… టోటల్ గా నాలుగు క్యారెక్టర్ల తో   ఫీల్ అండ్ ఫన్ ఉన్న షార్ట్ ఫిల్మ్ ను అందించారు ఈ హ్యాపీ ఎండింగ్ యూనిట్.

హార్ట్ కు టచ్  అయిన డైలాగ్స్:

చార్మినార్, తాజ్ మహాల్ ప్రేమకు సింబల్స్ మాత్రమే ప్రూఫ్స్ కావు.
ప్రేమలో వయస్సు కాదు మనస్సు ముఖ్యం.
ఈజీగా వచ్చే అమ్మాయిలు ఎర్లీగా వెల్లిపోతారు- కష్టంగా పడే అమ్మాయిలు కలకాలం ఉండిపోతారు.
అందంగా ఉన్నారని లవ్ చేయలేదు, లవ్ చేసిన తర్వాత అందంగా కనిపిస్తున్నావు.
పడితే పగబడి నవ్వుతుంది, ఎదిగితే ఏడుస్తుంది…………ఇదే సొసైటీ.

Watch Short Film/ Happy Ending/:

Comments

comments

Share this post

scroll to top