సెంచరీ కొట్టినప్పుడు “హర్మన్ ప్రీత్” సంబరపడకుండా..దీప్తిని కోపంగా తిట్టేసి, చివరికి కంటతడి. ఎందుకో తెలుసా?

మిథాలీసేనకు అపూర్వ విజయం. హార్డ్‌ హిట్టర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (171 నాటౌట్‌; 115 బంతుల్లో 20×4, 7×6) వన్డే క్రికెట్‌ చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటి అనదగ్గ ఇన్నింగ్స్‌ ఆడగా.. భారత్‌ మహిళల ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం కారణంగా ఇన్నింగ్స్‌ను 42 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్లో 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. హన్మన్‌ప్రీత్‌తో పాటు మిథాలీరాజ్‌ (36; 61 బంతుల్లో 2×4), దీప్తి శర్మ (25; 35 బంతుల్లో 1×4) రాణించడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 281 పరుగులు సాధించింది. ఛేదనలో ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. బ్లాక్‌వెల్‌ (90; 56 బంతుల్లో 10×4, 3×6), విలాని (75; 58 బంతుల్లో 13×4) చెలరేగారు. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. జులన్‌, శిఖ రెండేసి వికెట్లు తీసుకున్నారు. హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్‌ 23న జరిగే ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది.

watch video:

ఇన్నింగ్స్‌ 35వ ఓవర్ వేసిన ఆస్ట్రేలియా బౌలర్ క్రిస్టిన్ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా తరలించిన హర్మన్‌ప్రీత్ పరుగు కోసం మరో ఎండ్‌లో ఉన్న దీప్తి శర్మని పిలిచింది. అప్పటికి కౌర్ స్కోరు 98 పరుగులు.. అయితే ఒక పరుగు పూర్తి చేసిన తర్వాత.. ఫీల్డర్‌కి దూరంగా బంతి ఉండటంతో దీప్తి రెండో పరుగు కోసం కౌర్‌ని పిలిచింది. అయిష్టంగా రెండో పరుగు కోసం వెళ్లిన కౌర్‌.. తృటిలో ర‌నౌట్ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డింది. కౌర్‌ క్రీజులోకి వచ్చిన క్షణాల వ్యవధిలో బెయిల్స్ పడటంతో.. రనౌట్‌పై అనుమానం వ్యక్తం చేసిన ఫీల్డ్ అంపైర్ నిర్ణయం కోసం థర్డ్ అంపైర్‌‌ని ఆశ్రయించాడు. తాను ఔట్‌గా భావించిన హర్మ్‌న్‌ప్రీత్ కౌర్.. అసహనంతో మైదానంలో గట్టిగా అరుస్తూ దీప్తి శర్మని దాదాపు తిట్టినంత పనిచేసింది. హెల్మెట్‌ని తీసేసి విసిరిపారేసింది. అయితే.. థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో తప్పును గ్రహించిన కౌర్.. దీప్తి శర్మని క్షమాపణ అడిగి ఇన్నింగ్స్‌‌ని కొనసాగించింది. ఈ నిట్టూర్పు.. ఉపశమనం మధ్యలో.. సెంచరీ సంబరాలను చేసుకోవడం మరిచిపోయి కనీసం అభివాదం కూడా చేయలేదు.

watch video here:

https://twitter.com/IamVicySinha/status/888060616992149505

Comments

comments

Share this post

scroll to top