మహానటి సినిమా చూసేందుకు వెళ్లిన నటి హరిజేతకు చేదు అనుభవం ఎదురైంది. అదేమిటో తెలుసా..?

తెలుగు బిగ్‌ బాస్‌ షో ద్వారా నటి హరితేజ ఎంతగా పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఒక హీరోయిన్‌ కు వచ్చిన సెలబ్రిటీ హోదా ఆమెకు లభించింది. ఆ షోతో ఆమెకు బాగా పబ్లిసిటీ లభించింది. దీంతో ఆ షో అనంతరం ఆమెకు అనేక సినిమా ఆఫర్లు వచ్చాయి. టీవీల్లో పలు షోలు చేసే చాన్స్‌ కూడా ఆమెకు లభించింది. అయితే అది అప్పటి మాట. కానీ ఇప్పుడు ఆమెకు పాపులారిటీ తగ్గిందో ఏమో తెలియదు కానీ.. వెళ్లక వెళ్లక సినిమాకు కుటుంబ సభ్యులతో వెళ్లినందుకు ఆమెకు చాలా అవమానం జరిగింది. ఇంతకీ అసలు జరిగిన విషయం ఏమిటంటే…

ఇటీవలే విడుదలైన మహానటి చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. అందులో నటించిన కీర్తి సురేష్‌కు అయితే అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఆ సినిమాకు హరితేజ తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లింది. అమ్మా నాన్న చెల్లితో ఆమె కలసి వెళ్లింది. ఇంటర్వెల్‌ వరకు బాగానే ఉంది. అయితే ఇంటర్వెల్‌ సమయంలో చెల్లి పక్కన ఉన్న హరితేజ తన తల్లి అడగ్గానే ఆమె వైపుకు వెళ్లింది. ఇక అక్కడ ఉన్న హరితేజ తండ్రి హరితేజ ప్లేస్‌లోకి వచ్చి కూర్చున్నాడు. అయితే ఆయన పక్కనే మరో కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఉన్నారు. కూతురు హరితేజ తండ్రి పక్కనే ఉంది. అయితే అది చూసిన ఆ యువతి తాను అతని పక్కన కూర్చోలేనని తల్లికి చెప్పడంతో ఆ తల్లి నేరుగా వెళ్లి హరితేజతో గొడవకు దిగింది. అంతకు ముందు కూర్చున్న విధంగానే హరితేజను కూర్చోవాలని కోరింది. ఆమె తండ్రి పక్కన కూర్చోవడం వల్ల తన కూతురు అసౌకర్యంగా ఫీలవుతుందని, కనుక అతన్ని ఇంతకు ముందు స్థానానికే పంపాలని హరితేజకు ఆ యువతి తల్లి చెప్పింది.

అయితే హరితేజ మొదట దీన్ని లైట్‌గానే తీసుకుంది. ఆయన వయస్సు పెద్దవాడు, తండ్రి లాంటి వాడే కదా, కూర్చుంటే ఏమైంది అని హరితేజ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయినా వారు వినలేదు. పైగా యువతి తల్లి.. మీరు సినిమా వాళ్లు, ఎలాగైనా కూర్చుంటారు, ఎవరి పక్కనైనా కూర్చుంటారు, మాకా దరిద్రం ఇంకా పట్టలేదు.. అని అనడంతో హరితేజ సహించలేకపోయింది. ఆ తల్లీకూతుళ్లతో చాలా సేపు వాగ్వివాదం పెట్టుకుంది. అయితే చివరకు ఎలాగోలా సినిమా చూసి ఇంటికి వచ్చేశారు. అనంతరం హరితేజ తనకు థియేటర్‌లో జరిగిన చేదు అనుభవాన్ని గురించి వీడియోలో చెబుతూ కన్నీటి పర్యంతమైంది. సినిమా వాళ్లమైనంత తమను అంతలా తక్కువ చేసి చూడకండని, తాను మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెబుతూ దుఃఖించింది. సినిమా వారి పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలని చెప్పింది. ఈ క్రమంలో హరితేజ పోస్ట్‌ చేసిన ఈ విడయో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది..!

 

Comments

comments

Share this post

scroll to top