“హార్దిక్ పాండ్య” రన్ అవుట్ పై సోషల్ మీడియాలో వచ్చిన ఈ ట్రోల్ల్స్ చూస్తే నవ్వాపుకోలేరు.! [VIDEO]

ఇండియన్‌ క్రికెట్‌ అభిమానుల చూపంతా ఇప్పుడు జరుగుతున్న ఇండియా-సౌతాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌పైనే ఉంది. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓటమి పాలైన భారత్‌ కనీసం రెండో టెస్ట్‌ మ్యాచ్‌లోనైనా నెగ్గి రివేంజ్‌ తీర్చుకోవాలని భావిస్తుండగా మరో వైపు సౌతాఫ్రికా కూడా భారత్‌కు ఎట్టి పరిస్థితిలోనూ విజయం దక్కకుండా చూసేందుకు శ్రమిస్తోంది. అయితే మ్యాచ్‌ గెలిచే సంగతి ఏమోగానీ ఈ రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు జరిగిన ఓ ఫన్నీ సంఘటన ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది. అదేమిటంటే…

భారత్‌, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మన్లు హార్దిక్‌ పాండ్యా, విరాట్‌ కోహ్లిలు మ్యాచ్‌లో చక చకా పరుగులను సాధిస్తున్న టైం అది. అయితే అనుకోకుండా హార్దిక్‌ పాండ్యా రన్‌ అవుట్‌ అయ్యాడు. కానీ అది నిజానికి చాలా ఫన్నీ అయిన రనౌట్‌. ఎలా అంటే…

సాధారణంగా బ్యాట్స్‌మన్‌ ఎవరైనా ముందుగా బ్యాట్‌ను క్రీజులో ఉంచుతూ రనౌట్‌ కాకుండా క్రీజులోకి వెళ్తారు. అయితే హార్దిక్‌ పాండ్యా అలా కాదు. బ్యాట్‌ను క్రీజులోకి పెట్టలేదు. అలాగే వెళ్లాడు. తన కాళ్లను క్రీజులో ఉంచాడు. అయితే అప్పటికే బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో అతను రనౌట్‌ అయ్యాడు. అయితే హార్దిక్‌ పాండ్యా ఇలా రనౌట్‌ అవడం ఏమోగానీ అతన్ని చాలా మంది విమర్శిస్తున్నారు. మరీ అంత చెత్తగా రనౌట్ ఎలా అయ్యాడు అంటూ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఇక చాలా మంది అయితే ట్విట్టర్‌లో అతనిపై జోకులు వేస్తున్నారు. ఆలియాభట్‌ను హార్దిక్‌ పాండ్యా మించిపోయాడు… ఒక్క రాత్రి చదివే నేను ఎగ్జామ్‌ పాసవుతాను… సోమవారం పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది… స్టైల్‌గా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ చేసే పాండ్యా స్టైల్‌గా రనౌట్‌ అయ్యాడు.. అంటూ అతనిపై ట్విట్టర్‌లో జోకులు పేలుస్తున్నారు. దీంతో పాండ్యా రనౌట్‌ ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతోంది..!

 

Comments

comments

Share this post

scroll to top