పాండ్య పెళ్లి ఫొటోషూట్ ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే…హార్దిక్ కౌంటర్ చూస్తే నవ్వుకోవాల్సిందే!

టీమిండియా క్రికెట్‌లో పెళ్లిళ్ల సీజ‌న్ మొద‌లైంది. మొన్నీ మ‌ధ్యే మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్, బౌల‌ర్ భువనేశ్వ‌ర్ కుమార్‌లు పెళ్లి చేసుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ కోహ్లి చేరిపోయాడు. అయితే ఇదే జాబితాలో మ‌రో క్రికెటర్ చేర‌నున్నాడు. అత‌ని పేరు క్రునాల్ పాండ్యా. ఏంటీ.. ఈ పేరు విన‌లేదే.. అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయితే ఇత‌ను ప్ర‌స్తుతం టీమిండియా అంత‌ర్జాతీయ జ‌ట్టులో లేడు. కానీ లిస్ట్ ఎ జ‌ట్టులో ఉన్నాడు, ఇక ఇత‌ను ఆల్ రౌండ్ హార్దిక్ పాండ్యా అన్న కావ‌డం విశేషం.

టీమిండియా క్రికెట్ జ‌ట్టు స‌భ్యుడు, ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా అన్న క్రునాల్ పాండ్యా త్వ‌ర‌లో వివాహం చేసుకోనున్నాడు. అత‌ను పంఖూరి శ‌ర్మ అనే యువ‌తిని రెండు సంవ‌త్స‌రాల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఇరు కుటుంబాల్లో పెళ్లికి ఒప్పుకోవ‌డంతో త్వ‌ర‌లో వీరిద్ద‌రూ పెళ్లి పీట‌లెక్క‌నున్నారు. అయితే పెళ్లి సంద‌ర్భంగా క్రునాల్ పాండ్యా, ఫంఖూరి శ‌ర్మ‌లు ఇద్ద‌రూ డిఫ‌రెంట్ లుక్‌తో ఫొటోషూట్ లో పాల్గొన్నారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. వాటిని హార్దిక్ పాండ్యా షేర్ చేయ‌డం విశేషం.

ఇక క్రునాల్ పాండ్యా ఐపీఎల్ జ‌ట్టు అయిన ముంబై ఇండియ‌న్స్‌లో ఆట‌గాడు కూడా. ఈ ఏడాది జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడిన క్రునాల్ ఆ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను 2019లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ క‌ప్‌లో త‌న సోద‌రుడు హార్దిక్ తో క‌లిసి భార‌త్ త‌ర‌ఫున ఆడాల‌ని క‌ల‌లు కంటున్నాడు. కాగా క్రునాల్ పాండ్యా, పంఖూరి శ‌ర్మ‌లు ఇద్ద‌రూ ఈ నెల 27వ తేదీన ఒక్క‌ట‌వ్వ‌నున్నారు. వీరి వివాహం ముంబైలో జ‌ర‌గ‌నుంది. మ‌రి వీరికి బెస్టాఫ్ ల‌క్ చెబుదామా..!

Comments

comments

Share this post

scroll to top