ధోనిని భారత టీంలో తీసుకున్నారని “భజ్జి” ఎలా ఫైర్ అయ్యాడో తెలుసా..? దానికి ధోని ఫాన్స్ రియాక్షన్ హైలైట్!

ఐపీఎల్ ఫీవర్ ముగిసింది. కొద్దిరోజుల్లో “ఛాంపియన్స్ ట్రోఫీ” మొదలవనుంది. భారత జట్టు ఆటగాళ్లు అందరు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్ మొదలవకముందే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టు టీం లిస్ట్ బయటకి వచ్చింది. జట్టులో “హర్భజన్, గంభీర్” కు చోటు దక్కలేదు. అప్పుడు ఏమి స్పందించలేదు భజ్జి. కానీ ఇప్పుడు మాత్రం భారత మాజీ సారధి “మహేంద్ర సింగ్ ధోని” పై మండిపడుతున్నాడు!

నేను కూడా 19 ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నా. భారత తరపున మ్యాచ్ లు గెలిచినా, ఓడిపోయినా అందులో భాగస్వామ్యం అవుతూనే ఉన్నా. ప్రపంచకప్ లు గెలిచిన వాటిలో సభ్యుడిగా ఉన్నా. అయినా కొంతమందిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తున్నారు. ధోనికి ఇచ్చే ప్రత్యేకత నాకెందుకు ఇవ్వడంలేదు. ధోని పెద్దగా ఫామ్ లో లేకపోయినా చాంపియన్స్ ట్రోఫికీ ఎంపిక చేశారు. కానీ నన్ను ఎంపిక చేయలేదు. ఐపీఎల్ ఆడుతున్నది.. జాతీయ జట్టులో పునరాగమనం కోసమే” అని ధోని గురించి మీడియాతో అన్నాడు హర్బఝన్

ధోని కి ఉండే ఫాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందే పూణే జట్టు ఓనర్ ను ట్విట్టర్ లో ఒక రేంజ్ లో ఆడేసుకున్నారు. ఇప్పుడు భజ్జి పై కూడా మండిపడ్డారు అభిమానులు.


“భజ్జి…నీకంత సీన్ లేదు. చాంపియన్ ఆటగాడు ఎంఎస్ ధోనితో హర్భజన్ సింగ్ పోల్చుకుంటే స్టువర్ట్ బిన్నీ లాంటి సాధారణ ఆటగాడు కెప్టెన్ విరాట్ కోహ్లితో పోల్చుకున్నట్లు ఉంది. అసలు ధోనితో పోలిక ఏంటి. అంతర్జాతీయ క్రికెట్ కు ఐపీఎల్ కు చాలా తేడా ఉంది. అది తెలుసుకో ముందు. ధోని ఒక వికెట్ కీపరే కాదు.. మ్యాచ్ ఫినిషర్ కూడా. ధోనిలా వికెట్ కీపింగ్ చేసి మ్యాచ్ ఫినిష్ చేయగలవా. ఫీల్డింగ్ సెట్ చేయగలవా.విరాట్ కోహ్లికి సలహాలు ఇవ్వగలవా. ఒత్తిడిలో మ్యాచ్ ను భుజాలపై వేసుకోగలవా.ఫీల్డ్ లో కోహ్లితో కలిసి చురగ్గా పరుగు పెట్టగలవా?”

ధోని అభిమానులు అలా అనేసరికి హర్భజన్ స్పందించి. “నేను అలా అనలేదు. మీడియా తప్పుగా ప్రచారం చేసింది అని మీడియాపై మండిపడ్డాడు”

 

Comments

comments

Share this post

scroll to top