మీ అనుబంధాలకు విలువనివ్వండి. అదేలాగో ఈ వీడియో మీకు చాలా బాగా తెలుపుతుంది.

భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు కామనే.  గడియారంతో పాటు గిర్రున తిరుగున్న ఈ కాలంలో కాఫీలో  పంచధార ఎక్కవైందని భార్యతో భర్త. వస్తానన్న టైమ్ కు రాలేదని భర్తతో భార్య పోట్లాటలు సహజమే. కానీ అవన్నీ మన బంధాలని, అనుబంధాలను పెంచేవిగా ఉండాలి కానీ తుంచేలా కాదు. అదే చెబుతుంది ఈ షార్టీ.!   భార్య భర్తలను ప్రధాన పాత్రలుగా తీసుకొని మన బంధాలకు ఉన్న విలువ  ఎలాంటిదో..అనే జీవిత సత్యాన్ని అద్భుతంగా చూపించారు ఈ షార్ట్ ఫిల్మ్ లో ప్రముఖ దర్శకుడు తనూజ్ భాటియ.

Story:

భార్య భర్తల మద్య జరిగిన చిన్న గొడవ పెద్దగా మారుతుంది. ఎంతగానంటే ఒక్క ఇంట్లో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోనంతగా…అలాగే రోజులు గడిచిపోతాయి. ఆ సమయంలోనే అనన్య( భార్య)కు ఆమె ఫ్రెండ్ కాల్ చేసి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.దానితో పాటు ఆలుమగల మద్య ఉండాల్సిన అనుబంధాలను కూడా తెలుపుతుంది అనన్యకు…  అప్పుడు అనన్యకు ఈ రోజు తన పెళ్లి రోజని గుర్తుకువస్తుంది. ఎలాగైనా తమ మద్య గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని తన భర్తతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలని…..భర్తను సర్ప్రైజ్ చేయడానికి ఇంటికి అందంగా అలంకరిస్తుంది. కేక్ ను సొంతంగా తయారు చేస్తుంది..తాను కూడా అందంగా రెడీ అయ్యి భర్తకోసం ఎదురుచూస్తుంది. ఇంతలోనే భర్తకూడా ప్లవర్ బోకే తో వచ్చి అనన్యకు పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలుపుతాడు.

ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుండగా…..అనన్యకు పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది. విషయం ఏంటి అని అడగగానే రైల్ యాక్సిడెంట్ లో  మీ భర్త చనిపోయాడు. అతని ఫర్స్ ఆధారంగా మీకు ఫోెన్ చేస్తున్నాం వచ్చి…డెడ్ బాడీని గుర్తించాల్సి ఉంటుందని చెబుతాడు పోలీస్…అదేంలేదు నా భర్త నాతోనే ఉన్నాడని చెబుతూ హాల్ లోకి వస్తుంది అనన్య…తన భర్త అక్కడ ఉండండు…ఇప్పటి వరకు తాను ట్రాన్స్ లో ఉన్నానని…తన భర్త చనిపోయాడని ఏడుస్తూ కూర్చుంటుంది అనన్య.

అంతలోనే బాత్ రూమ్ నుండి వచ్చిన అనన్య భర్త…….ఈ రోజు ట్రైన్ లో నా పర్స్ ఎవరో కొట్టేశారు అని అంటాడు. ఆ కొద్దిసేపు అనన్య పడ్డ బాధను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. స్టోరి చెప్పడం కన్నా పిక్చరైజేషన్ చాలా బాగుంది. ఓసారి చూసి దానిని ఫీల్ అవ్వండి.

Watch Video: Happy Anniversary

 

Comments

comments

Share this post

scroll to top