11ఏళ్ల పిల్లాడు స్ఫూర్తి పాఠాలు చెబుతున్నాడు!

ప‌ట్టుమ‌ని 11 ఏళ్లు కూడా నిండ‌ని ఈ కుర్రాడి పేరు హ‌మ్మ‌ద్. నిత్యం తుపాకుల మోత‌తో ద‌ద్ద‌రిల్లే పాకిస్తాన్‌లో ఈ బుడ‌త‌డు వేలాది మందిలో త‌న పాఠాల‌తో స్ఫూర్తి నింపుతున్నాడు. ఈ వ‌య‌సులో ఎవ‌రైనా స్మార్ట్ ఫోన్లు, గేమ్స్‌, సినిమాలు అంటూ మారాము చేస్తారు. కానీ ఈ చిన్నారి మాత్రం వ‌య‌సుకు మించిన ప‌రిణ‌తి సాధించి అంద‌రిని ఆశ్య‌ర్య పోయేలా చేస్తున్నాడు. స్వంతంగా యూట్యూబ్‌లో ఛాన‌ల్ ఏర్పాటు చేశాడు. దాని ద్వారా పాఠాలు చెప్ప‌డం స్టార్ట్ చేశాడు.

hammad safi motivational speaker

ఎప్ప‌టిక‌ప్పుడు స‌బ్జెక్టుల‌ను అప్ లోడ్ చేస్తూ ఎంద‌రినో ప్ర‌భావితం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఎవ‌రైనా ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే జ‌డుసుకుంటారు. ఇబ్బంది ప‌డ‌తారు. స్టేజి ఫియ‌ర్‌తో వెన‌క్కి వెళ్లిపోతారు. కానీ హ‌మ్మ‌ద్ అలా కాదు. నిత్యం చ‌దువుతూ .నోట్స్ రాసుకుంటూ.పాఠాలు వ‌ల్లె వేస్తూ. ట్రైన‌ర్‌గా త‌క్కువ టైంలో పాక్‌లో గ్రేట్ మెంటార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌భుత్వం చేయ‌లేని ప‌నిని ఇత‌డు చేస్తున్నాడు. అక్ష‌రాల వెలుగులు పంచుతూ .కొత్త కొత్త పాఠాల ద్వారా విద్యార్థులు, పెద్ద‌ల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నాడు. కొంద‌రు కాలాన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటే.ఇత‌డికి ప్ర‌తి నిమిషం విలువైన‌దే. ఇంగ్లీష్ భాష‌పై హ‌మ్మ‌ద్ కు మంచి ప‌ట్టుంది. యూనివ‌ర్శిటీలో చ‌దువుకుంటున్న విద్యార్థుల‌తో నిరంత‌రం క‌లుస్తూ.వారితో చ‌ర్చిస్తూ.సందేహాలు తీరుస్తూ. ట్రైనింగ్ ఎక్స్‌ప‌ర్ట్‌గా ఎదిగారు. ఇతడి యూట్యూబ్ ఛాన‌ల్‌కు ల‌క్షా 16 వేల మంది స‌బ్ స్క్రైబ‌ర్స్ ఉన్నారంటే ఇత‌డికి వున్న ఫాలోయింగ్ ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

మీరు మీలాగా వుంటే ఇలాగే ఉండి పోతారు. మ‌నం గ‌దుల్లోనే వుంటే ఎలా.కిటికీ త‌లుపులు తెర‌వండి. ఎంతో నేర్చుకునే అవ‌కాశం మ‌న‌కు ఈ నేచ‌ర్ ఇస్తోంది. రండి నాతో చేతులు క‌ల‌పండి. సంతోషంగా నేర్చుకుందాం. క‌ష్ట‌ప‌డితే.ఇష్ట‌ప‌డితే ఏదీ ఇబ్బంది అనిపించ‌దు అంటాడు హ‌మ్మ‌ద్. స్వంత భాష‌లో ప‌ట్టు సాధిస్తే చాలు.ఇంగ్లీష్ నేర్చుకోవ‌డం ఈజీ అంటాడు. ప్రాక్టీస్ చేయండి .ఆంగ్ల ప‌దాలు ఎలా ప‌ల‌కాలో.ఎలా ఉచ్చ‌రించాలో యూట్యూబ్ లో పెట్టాడు. అమెరికా మాజీ అధ్య‌క్షుడు ఒబామా ఎలా ప్ర‌సంగిస్తున్నారో ఓసారి మీరూ చూడండి అంటూ త‌న క్లాసుల‌కు వ‌చ్చే వారికి సూచిస్తున్నారు హ‌మ్మ‌ద్. ప్ర‌తి సెక‌న్ ఓ ఛాలెంజ్. అప‌జ‌యం విజ‌యానికి మొద‌టి మెట్టు.అదే ఆఖ‌రుది కాదు అంటాడు. అంతేనా పాకిస్తాన్‌లో జాతీయ క‌వులు, ర‌చ‌యిత‌లు, సంఘ సంస్క‌ర్త‌ల గురించి హ‌మ్మ‌ద్ వీరికి బోధిస్తున్నాడు. ప్ర‌ముఖ జాతీయ క‌వి ఇక్బాల్‌ను ఉటంకించ‌డం అల‌వాటు. మ‌న‌కు స్వేచ్ఛ ల‌భించ‌క‌పోతే ఆంగ్లేయులకు ఊడిగం చేసే వాళ్లం అంటూ జాతీయ భావాన్ని పెంపొందిస్తున్నాడు. శాంతి, సామ‌ర‌స్యం వ‌ల్లే మ‌నం అభివృద్ధిని సాధించ‌గ‌లం. ఇదే మ‌న నినాదం కావాల‌ని బోధిస్తున్నాడు. ఆర్ట్స్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, ఇంజ‌నీరింగ్ , డాక్ట‌ర్స్‌, ఇతరులంతా హ‌మ్మ‌ద్ అభిమానులే. అత‌డి స్టూడెంట్సే.

ఉద్యోగం దొర‌క‌ని వాళ్లు, నిరాశ‌కు లోనైన వాళ్లు ఈ బుడ‌త‌డి స్పీచెస్ విని మారిపోయారు. హ‌మ్మ‌ద్‌కు ఇంగ్లీష్ నేర్పించిన వ‌ఖీల్ టీచ‌ర్ .ఏదో ఒక రోజు నా స్టూడెంట్ దేశం గర్వించే స్థాయికి చేరుకుంటాడు అంటాడు. తండ్రి ర‌హీం బిజినెస్ మెన్‌. మా వాడిని చూస్తే గ‌ర్వంగా ఉంటుంది. అందుకే వాడు ఎదిగేందుకు టీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశా. నా అంచ‌నాల‌కు మించి ఎంద‌రికో దిశా నిర్దేశ‌నం చేసే స్థాయికి చేరుకున్నాడు. ఇంత‌కంటే ఆనందం ఇంకేముంటుంది అంటాడు. స్కూల్‌కు వెళ‌తాడు. పాఠాలు వింటాడు. తిరిగి యూనివ‌ర్శిటీలో వాలి పోతాడు. అక్క‌డ ఆంగ్ల భాష‌పై మ‌రింత ప‌ట్టు సాధించేందుకు ప్రాక్టీస్ చేస్తాడు. ఇంత‌కంటే ఏం కావాలి. షాపింగ్‌లు, ఐ మాక్స్ థియేట‌ర్లు.ఆన్‌లైన్ల‌లో చాటింగ్‌లు.కొనుగోళ్లు చేసే మ‌న స్టూడెంట్స్‌.ఈ బుడ‌త‌డిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది క‌దూ.

Comments

comments

Share this post

scroll to top