సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న వింత ఆకారం.. ఇంత‌కీ ఇది ప‌క్షా.. జంతువా..?

సెల్ నెట్ వ‌ర్క్ సిగ్న‌ల్స్ పుణ్యామాని పిచ్చుక‌లు చూద్ద‌మ‌న్నా కాన‌రావ‌డం లేదు. ప‌ల్లెలు ప‌ట్ట‌ణాలుగా రూపాంత‌రం చెందుతున్న క్ర‌మంలో అనేక జీవ జాతి మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇక మ‌హ‌న‌గరాల కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుని కొన్ని జీవ జాతులు ఇప్ప‌టికే అంత‌మైన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఓ జంతువుకు సంబందించిన స‌మాచారం సోష‌ల్ మీడియాని ఆలోచ‌న‌లో ప‌డేసింది. ఆకారంలో వింత‌గా క‌నిపిస్తు నెటిజ‌న్ ల ని చాలా ఆక‌ట్టుకుంటుంది. ఇంత‌కీ ఇది ప‌క్షా.. జంతువా..?2016-1

ఒక నెల రోజులుగా వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్లాంటి సోష‌ల్ మీడియాలో ఈ జంతువుకు సంబందించిన ఫోటో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. తెల్ల‌గా మెరిసిపోతు అంద‌రిని ఆక‌ర్షిస్తున్న ఈ ఫోటోలో ఉన్న‌ది అస‌లు ప‌క్షా.. జంతువా అని తేల్చుకోలేక‌పోతున్నారు. ఈ విష‌యం అటు .. ఇలా సోషల్ మీడియాలో ఓ పక్షి ఫొటో హల్‌చల్ చేస్తోంది. ఆర్నిథాలజీ ప‌రిశోధ‌కులు చెపుతున్న వివ‌రాల ప్ర‌కారం ఇది అరుదుగా క‌నిపించే ప‌క్షి జాతి అని.. 100 సంవ‌త్స‌రాల క్రిత‌మే అంతమ‌యిన ప‌క్షి జాతికి చెందిన‌దిగా చెపుతున్నారు. దీని పేరు హికు. చూడ‌టానికి నెమ‌లి ఆకారంలో పించాన్నిక‌లిగి తెలుపు, కాష‌య వ‌ర్ణాల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని చెపుతున్నారు. నాలుగు కాళ్లతో.. నక్క లాంటి శరీరం, కొన్ని కుక్కలకు ఉన్నట్లుగా శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, తోక, రెండు కొమ్ములు ఉంటాయి. ఎక్కువ‌గా ఇది నేపాల్ ప్రాంతాల్లో ఉండేద‌ని స‌మాచారం. అక్క‌డి ప్రాంత వాసుల‌కి ఈ ప‌క్షి అంటే మంచికి గుర్తుగా పిలుచుకుంటారంట‌. ఉద‌యం లేవ‌గానే దీన్ని చూస్తే అంతా మంచి జరుగుతుందన్న నేపాల్ వాసుల‌కు సెంటిమెంటు ఉందని చెబుతున్నారు. అయితే ఆర్నిథాలజీ నిపుణులు దీనికి ఎగిరే శ‌క్తి కూడా ఉంద‌ని చెపుతున్నారు.nepal-relief

నేపాల్ చ‌రిత్రలోని క‌థ ఆదారంగా..
శివుడు, పార్వ‌తి దేవిల‌కు ఇష్ట‌మైన ప‌క్షి ఇది. హిమాల‌యల్లో శివుడు సంచ‌రించే ప్రాంతంలో దీని నివాసం అని చెపుతున్నారు. పార్వ‌తీ దేవి ప్రేమ‌గా దీనికి పండ్లు ప‌లాలు తినిపించేద‌ని.. లోక మాతకు అత్యంత ఇష్ట‌మైన ఈ జీవిని ఎవ‌రు చంప‌లేర‌ని శివుడు దీనికి వ‌ర‌మిచ్చాడ‌ని అక్క‌డి వాసుల న‌మ్మ‌కం. నేపాల్ ప్రాంతంలో మాత్ర‌మే క‌నిపించే హికు ఎక్కువగా వర్షాకాలంలో బ‌య‌టకి వ‌స్తుందంటా. తర్వాత హిమాలయాలకు వెళ్లిపోతుందని నేపాల్ వాసులు చెబుతున్నారు. దీనిలో నిజ‌మెంతుందో తెలియ‌దు కానీ.. ఈ హికు ప‌క్షి మాత్రం పిచ్చ క్రేజ్ ను సంపాదించుకుంది.

ప‌క్షి శాస్త్రం

Comments

comments

Share this post

scroll to top