పురుషులు మూత్రం పోసే విధానాన్ని బ‌ట్టి… వారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం గురించి తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం పురుషుల‌కి. ముఖ్యంగా వారు మూత్రం పోసే విధానంపై ఇప్పుడు మేం చెప్ప‌బోయే అంశం ఆధార ప‌డి ఉంటుంది. అవును, అదే. పురుషులంద‌రికీ అంగం సైజ్ ఒక్క‌టిగా ఉండ‌న‌ట్టే దాని షేప్‌లోనే తేడాలు ఉంటాయి. కొంద‌రికి అంగం స్ట్రెయిట్‌గా ఉంటే కొంద‌రికి వంగి ఉంటుంది. అయితే ఇలా అంగం వంగి ఉన్న‌వారు మూత్రం స్ట్రెయిట్‌గా పోయ‌లేరు. వీరే కాదు, అంగం స్ట్రెయిట్‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రు మూత్రం స్ట్రెయిట్‌గా పోయ‌లేరు. ఇబ్బందులు ప‌డతారు. అలా గ‌న‌క ఇబ్బందులు ప‌డుతుంటే వారికి క్యాన్స‌ర్ వ‌స్తుంద‌ని తెలుసుకోవాలి. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. సైంటిస్టులే చెబుతున్నారు.

American Society for Reproductive Medicine అనే సంస్థ వారు 15 ల‌క్ష‌ల మంది పురుషుల‌ను ప‌రిశీలించారు. వారి అంగం సైజ్‌, షేప్‌, వారు మూత్రం పోసే విధానంతోపాటు వారికి ఉన్న వ్యాధుల గురించి కూడా ప‌రిశోధ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలో తెలిసిందేమిటంటే… అంగం వంక‌రగా ఉన్న‌వారితోపాటు మూత్రం స్ట్రెయిట్‌గా పోయ‌ని వారికి జీర్ణాశ‌యం, చ‌ర్మం, వృష‌ణాల క్యాన్స‌ర్ వ‌స్తున్న‌ట్టు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేకంగా అంగం వంక‌రగా ఉన్న కొంద‌రు పురుషుల‌ను కూడా వారు ప‌రిశీలించారు. ఆ త‌రువాతే వారు నిర్దార‌ణ‌కు వ‌చ్చి పై విష‌యం తెలిపారు.

ఇలా అంగం వంక‌ర ఉండ‌డాన్ని వైద్య ప‌రిభాష‌లో Peyronie’s Disease అంటార‌ట‌. ఈ వ్యాధి ఉన్న‌వారికి క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ట‌. ఇలాంటి వారికి వృషణాల క్యాన్స‌ర్ వ‌చ్చే శాతం 40 వ‌ర‌కు ఉంటుంద‌ట‌. అలాగే వీరికి స్కిన్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం 29 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని, జీర్ణాశ‌యం క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం 40 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ని వైద్యులు అంటున్నారు. అయితే ఈ విష‌యంపై ఇంకా పరిశోధ‌న‌లు చేస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని సైంటిస్టులు అంటున్నారు.

 

Comments

comments

Share this post

scroll to top