“ఐశ్వర్య రాయ్” నా తల్లి అన్న యువకుడి వెనకున్న అసలు కథ ఇదే.! అలా ఎందుకన్నాడంటే.?

ఐశ్వ‌ర్యారాయ్‌.. బాలీవుడ్ ఎవ‌ర్‌గ్రీన్ బ్యూటీ ఈమె. ఎప్పుడు చూసినా య‌వ్వ‌నంగానే క‌నిపిస్తుంది. ఆమె అస‌లు ఏజ్ ఎంతో ఎవ‌రూ చెప్ప‌లేరు అన్నంత అందంగా ఆమె ఉంటుంది. పెళ్ల‌య్యాక అస‌లు సినిమాల వైపు చూడ‌డ‌మే మానేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఆరాధ్య పుట్టాక వెండి తెర‌కు చాలా దూరంగా ఈమె ఉంటోంది. అయిన‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు మ‌న‌కు ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఐశ్వ‌ర్యారాయ్ ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంది. అయితే ఇంత‌కీ ఇప్పుడు విష‌యం ఏమిటంటే.. ఐశ్వ‌ర్యారాయ్‌కు ఆరాధ్య కాకుండా ఇంకో కుమారుడు ఉన్నాడ‌ట‌. అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌లో..! ఏంటీ షాకింగ్‌గా ఉందా..! అవును మ‌రి, ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అత‌ని పేరు సంగీత్ కుమార్‌. ఉంటున్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ ప‌ట్నంలో. ఇత‌ను తాజాగా మీడియా ముందుకు వ‌చ్చాడు. తాను ఐశ్వ‌ర్యారాయ్ కొడుకునని చెప్పాడు. లండ‌న్‌లో ఐవీఎఫ్ ప‌ద్ధ‌తిలో తాను ఐశ్వ‌ర్యారాయ్‌కు 1998లో జ‌న్మించాన‌ని అన్నాడు. అంతేకాదు, ఐశ్వ‌ర్యారాయ్ త‌ల్లిదండ్రులు త‌న‌కు 2 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు త‌మ ద‌గ్గ‌రే ఉంచుకుని పెంచుకున్నార‌ని అన్నాడు. అనంత‌రం ఆదివేలు రెడ్డి అనే వ్య‌క్తి త‌న‌ను తండ్రిలా పెంచుకున్నాడ‌ని చెప్పాడు. దీంతో ఇప్పుడిత‌ని వార్త నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

కాగా, సందీప్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వైజాగ్ పోలీసులు చెప్పారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించాడని ఐశ్వర్య ఒక్క ఫిర్యాదు చేస్తే చాలని చెబుతున్నారు.తాను ఏఆర్ రెహ్మాన్ శిష్యుడినని సందీప్ గతంలో చెప్పుకున్నట్లు అనధికారికంగా తెలిసిందని సీఐ తెలిపారు.

సందీప్ ఎవరనే విషయం ఆరా తీయగా..:

చిన్నతనంలో చోడవరంలో నివాసం వున్న సంగీత్‌కుమార్‌ తన తండ్రి మావూళ్లు ఉద్యోగరీత్యా విశాఖపట్నం వెళ్లిపోయాడు. సంగీత్‌కుమార్‌ రాయ్‌గా పేర్కొన్న సంగీత్‌కుమార్‌ అసలు పేరు ఆదిరెడ్డి సంగీత్‌కుమార్‌. సంగీత్‌కుమార్‌ తండ్రి ఆదిరెడ్డి మావూళ్లు ఆర్టీసీలో కండక్టర్‌ కావడంతో విశాఖపట్నం వెళ్లిపోయారు. విశాఖ వెళ్లిన తరువాత కొంతకాలం పాశ్చాత్య సంగీతంలో పాటలు పాడుతూ, యూట్యూబ్‌లో సొంతంగా వెబ్‌ రేడియో కూడా నడిపిన సంతోష్‌కుమార్‌ కొంతకాలంగా బెంగళూరులో ఉంటున్నట్టు సమాచారం. సంగీత్‌కుమార్‌ బంధువులు చోడవరంలో ఉన్నారు. బెంగళూరులో వుంటున్న సంగీత్‌కుమార్‌ గత నెలలో చోడవరం బంధువుల ఇంటికి వచ్చి వెళ్లినట్టు చెబుతున్నారు.

ఐశ్వర్యారాయ్‌ కొడుకునంటూ కన్నడ ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగీత్‌కుమార్‌ కేవలం ప్రచారం కోసమే ఈ హడావిడి చేస్తున్నాడని అంటున్నారు. చాలాకాలం క్రితమే విశాఖ వెళ్లిపోయిన సంగీత్‌కుమార్‌కు స్థానికంగా ఎవరితో పెద్దగా పరిచయం లేదనే చెప్పాలి. అయితే ఐశ్వర్యారాయ్‌ కొడుకునని, తాను చిన్నతనంలో చోడవరంలో పెరిగానంటూ అతను ఇచ్చిన ఇంటర్వ్చూ మన తెలుగు ఛానళ్లలో కూడా ప్రసారం కావడంతో ఇప్పుడు చోడవరం యువకుడి గురించి అంతా ఆసక్తిగా ఆరా తీస్తున్నారు. సంగీత్‌కుమార్‌ తన ఫేస్‌బుక్‌లో సైతం ఐశ్వర్యారాయ్‌ కొడుకుగానే పేర్కొనడం గమనార్హం.

Comments

comments

Share this post

scroll to top