ఆ యువకుడు కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు..! కానీ ఎస్సై బయటకెళ్ళి అతనికి స్వీట్ ఎందుకు తెచ్చారో తెలుసా.?

మన సమాజంలో పోలీసులంటే ఒక భయం ఉంటుంది..ఖాకీ యూనిఫామ్ తో కనిపించిన వారిని చూడగానే అందరిలో కూడా ఒక రకమైన భయం కనపడుతుంది.భయం మాత్రమే కాదు వ్యతిరేఖ భావన కూడా పోలీసుల పట్లనే ఎక్కువగా ఉంటుంది.మేం కూడా మనుషులమే ,మాకు ప్రేమానురాగాలుంటాయని వారెన్ని సార్లు నిరూపించుకున్నా కూడా.. ఖాకీలంటే కఠినాత్ములే అనే భావన మన మైండ్లో  ఫిక్స్ అయిపోయింది..అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు పోలీసుల ప్రేమను తెలియచేస్తాయి.కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన అబ్బాయికి సడన్ సర్ఫ్రైజ్ ఇచ్చారు పోలీసులు.. ఎక్కడో, వాళ్లిచ్చిన సర్ఫ్రైజ్ ఏంటో తెలుసా..

ముంబయికి చెందిన అనీశ్‌  కంప్లయింట్ ఇవ్వడానికి  పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కంప్లైంట్ ఒక పేపర్ పై రాసివ్వమని అక్కడ సిబ్బంది చెప్తే అదే పని చేసాడు..తెల్ల పేపర్ పై  కంప్లైంట్‌ రాస్తూ తన వివరాలన్నీ అందులో రాసి ఎస్సై కి ఇచ్చాడు.. ఆ ఎస్సై అనీశ్‌ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్‌ తెగ భయపడిపోయాడు.కాసేపటికి బయటికి వెళ్లిన వ్యక్తి వచ్చారు.అతనితోపాటు పోలీసు స్టేషన్ సిబ్బంది కూడా అనీష్ ముందున్నారు..కొద్దిసేపటివరకు ఏం జరుగుతుందో అనీష్ కు అర్దం కాలేదు..

టేబుల్ పై పోలీసులు తెచ్చినకేక్ పెట్టి కొవ్వొత్తులు వెలిగించి,అక్కడే స్టేషన్లో అనీష్ బర్త్  డే సెలబ్రేట్ చేశారు..అనీష్ ఇచ్చిన కంప్లైంట్ పేపర్లో అతను రాసిన వివరాలు చదువుతున్న ఎస్సై ,అందులో అనీష్ బర్త్ డే డేట్ చూసి ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు.. అనుకోని ఈ హఠాత్పరిణామానికి అనీష్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.సమస్య చెప్పుకుందామని వెళ్లిన చోట,సమస్య తీరడం కన్నా ముందు అవతలి వారి స్పందనే కొంచెం మనోధైర్యాన్నిస్తుంది.ఇక్కడ అనీష్ కి జరిగింది అదే.. ఈ ఫొటోలను ముంబయి పోలీసులు అధికారిక ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే 1000కిపైగా లైక్‌లు 200లకు పైగా రీట్వీట్లు వచ్చాయి. పోలీసులు ఇలా స్నేహపూర్వకంగా ఉంటే ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు ..

Comments

comments

Share this post

scroll to top