3 రోజుల పసికందును ఆటో లో చూసాడు ఆ వ్యక్తి…తర్వాత ఎలా కాపాడాడో తెలుస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

కన్న తల్లిదండ్రులు పైశాచికత్వమో, పైత్యమో లేదా మరే ఇతర కారణాలో తెలియవు కానీ.. నేడు మన దేశంలో అనేక చోట్ల అనేక మంది శిశువులు అనాథలుగా మారుతున్నారు. ఏ చెత్త కుప్పలోనే లేదంటే రోడ్డు పక్కనో వారిని పడేస్తున్నారు. దీంతో వారు అనాథ శరణాలయాల్లో పెరుగుతున్నారు. అయితే ఇలాంటి ఘటనల్లో శిశువులు దొరికినప్పుడు చాలా మందికి ఏం చేయాలో తెలియదు. ఆ శిశువును ఎవరికి అప్పగించాలి ? ఏం చేయాలి ? వంటి అంశాల్లో అవగాహన ఉండదు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఆ యువకుడికి ఎదురైంది. తనకు రహదారి పక్కన ఓ ఆటోలో శిశువు దొరికింది. మొదట పోలీసులకు సమాచారం అందించాడు. వారు స్పందించలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా పోలీసులకు పెద్ద ఎత్తున యూజర్లు సమాచారం చేరవేయడంతో చివరకు ఆ పసికందును పోలీసులే చేరదీశారు.

అతని పేరు అమన్‌. ముంబై వాసి. ఈ నెల 19వ తేదీన రాత్రి 11 గంటలకు రహదారిపై వెళ్తుండగా, పక్కనే పసికందు ఏడుపు వినిపించింది. అసలే అది నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం. అక్కడ రాత్రి పూట అంత స్పష్టంగా చిన్నారి ఏడుపు వినిపించే సరికి అతను అక్కడే ఆగి చుట్టూ చూశాడు. చిన్నారి కోసం వెదికాడు. ఆ పాప అక్కడే రహదారి పక్కన ఉన్న ఆటోలో ఏడుస్తూ కనిపించింది. ఆకలి బాగా అయిందేమో వణుకుతోంది. చిన్నారి ఆరోగ్య స్థితి కూడా సరిగ్గా ఉన్నట్టు లేదు. దీంతో ఆ పసికందును అమన్‌ చేరదీశాడు. చూస్తే ఆ శిశువు జన్మించి 3 నుంచి 5 రోజులు అవుతున్నట్టు అతను గుర్తించాడు.

అయితే అమన్‌కు మొదట ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో తనకు 3 నుంచి 5 రోజుల వయస్సు గల చిన్నారి దొరికిందని, ఇప్పుడేం చేయాలి ? అంటూ ట్విట్టర్‌ పోస్ట్‌ పెట్టాడు. ఇందుకు కొందరు స్పందించి పోలీసులకు కాల్‌ చేయమన్నారు. అమన్‌ చేశాడు. అయినా స్పందన లేదు. దీంతో మళ్లీ ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టాడు. అయితే ఈ సారి నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించడంతో పోలీసులకు సమాచారం చేరింది. దీంతో వారు అమన్‌ను కాంటాక్ట్‌ అయ్యారు. ఓ లేడీ కానిస్టేబుల్‌ అమన్‌ నుంచి ఆ పసికందును తీసుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఆ పాపను కాపాడారు. ఆ పసికందుకు పాలు పట్టారు. ప్రస్తుతం ఆ శిశువు కు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. కాగా ఆ పసికందును రక్షించిన అమన్‌ను ముంబై పోలీసులు అభినందించారు. ఇక అమన్‌కు సోషల్ మీడియాలో అయితే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ పాప ఎలా ఉంది ? అంటూ చాలా మంది మెసేజ్‌లు పెట్టారు. దీనికి స్పందించిన అమన్‌ ఆ పాపతో కలిసి ఫొటో దిగి దాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ఈ విషయం పట్ల నెటిజన్లు చాలా మంది స్పందించి వారు కూడా అమన్‌ను అభినందించారు. అవును మరి, నిజంగా అమన్‌ చేసింది చాలా గొప్ప పని అని చెప్పవచ్చు కదా..!

Comments

comments

Share this post

scroll to top