“గోరింక” కోసం “గువ్వ” పాడే పాట…! “గువ్వ గోరింక” చిత్రంలోని మొదటి పాట! [VIDEO]

వినూత్నమైన సినిమాలకు పట్టం కడుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిపై నమ్మకంతో. ఆకార్ మూవీస్ సంస్థ ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో.. పూర్తి సహజమైన పాత్రలతో.. నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ గువ్వగోరింక. సత్యదేవ్, ప్రియాలాల్, మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారాలు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో దాము కొసనం, దళం జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇదొక ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ, మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఇద్దరు ప్రేమికుల మధ్య జరగిన సంఘటనలకు రూపమే గువ్వగోరింక. విభిన్న మనస్తత్వం కలిగిన ఇద్దరు ప్రేమికుల ఈ ప్రేమకథను దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు. కొత్తతరహా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రమిది అని తెలిపారు.

హీరో సత్యదేవ్ బర్త్డే సందర్బంగా విడుదలైన మొదటి పాట “తిన్నగా తిన్నగా” మీకోసం!

watch video:

Song Details:

Song: Tinaga Tinaga
Movie: Guvva Gorinka
Banner: Akar Movies
Producer: Damu Reddy Kosanam, Dalam Jeevan Reddy
Director: Mohana Bammidi
Casting: Satya Dev, Priyaa Lal
Music: Suresh Bobbili
Singer: Wilson Herald
Lyrics: Mittapally Surender

Comments

comments

Share this post

scroll to top