పంజాబ్ పాట‌ల కెర‌టం గురుదాస్ మాన్ – రికార్డుల మోత మోగిస్తున్న మ‌ఖ్‌నా సాంగ్

మ‌నమంతా ద‌ద్ద‌మ్మ‌ల‌మై అమెరికాను అనుస‌రిస్తూ జ‌పం చేస్తుంటే, అమెరికన్లు మాత్రం ఇండియ‌న్ సింగ‌ర్స్‌కు ఫిదా అవుతున్నారు. వాళ్ల గొంతుల‌తో మ‌మేక‌మై పోతున్నారు. వీరిని మెస్మ‌రైజ్ చేస్తున్న‌ది తెలుగు వాళ్ల‌నుకుంటే పొర‌ప‌డిన‌ట్లే. పాప్‌తో జోషనింపుతున్నారు.ఊగిపోయేలా, ఉర్రూతులూగిస్తున్నారు. పంజాబ్ స్టార్స్‌ పాప్ రాక్.ఫోక్ సింగ‌ర్స్‌. వారిలో జెస్సీ, ద‌లేర్ మెహందీతో పాటు గురుదాస్ మాన్ కూడా. యూట్యూబ్‌లో వాళ్లు రూపొందించిన ఆల్బ‌మ్స్ మిలియ‌న్స్ వ్యూవ‌ర్స్‌ను దాటుతూ రికార్డులు తిర‌గ రాస్తున్నాయి. స్టేజ్ షోలు, వ‌ర‌ల్డ్ టూర్స్ , టీవీల‌లో నిరంత‌రం ఏదో ఒక ఛాన‌ల్‌లో వీరు పాడిన పాట‌లు దుమ్ము రేపుతున్నాయి. సంగీతాభిమానుల‌ను సేద‌తీరేలా చేస్తున్నాయి. గురుదాస్ మాన్‌ ఇటీవ‌ల విడుద‌ల చేసిన మ‌ఖ్‌నా అనే సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య దూరం పెరిగితే ఎలా ఉంటుందో చూపించిన ఈ పాట ఆల్ టైం రికార్డుగా న‌మోదు చేసింది. మాన్ గొంతులోని మాధుర్యాన్ని జుర్రుకునేందుకు ఫ్యాన్స్ తెగ పోటీ ప‌డుతున్నారు. ఏజ్ పెరిగినా వాయిస్‌లో ఎలాంటి మార్పు రాలేదు. గాయ‌కుడు ర‌చ‌యిత‌ న‌టుడుగా పేరు పొందిన గురుదాస్ మాన్ .పాట‌ల్లో ఉపు ఉంటుంది.జోష్ ఉండేలా రాస్తాడు. ఆడ‌తాడు. డ్యాన్సుల‌తో అద‌ర‌గొడ‌తాడు. లైట్ స్టెప్స్‌తో రూపొందించిన మ‌ఖ్‌నా ఆల్బంకు ఆద‌ర‌ణ పెరుగుతోంది.

gurudas mann

ఓ కుడియే అంటూ జెస్సీ పాడితే జ‌నం ఫిదా అయ్యారు. బోలో త‌రార అంటూ పాడితే ద‌లేర్ మెహందీని అక్కున చేర్చుకున్నారు. ర‌బ్బ‌రు గాజులు అంటూ వ‌చ్చీరాని తెలుగులో పాడితే ఇక్క‌డి వారు అభిమానులై పోయారు. పంజాబ్ అంటేనే చైత‌న్యం. గ‌ట్టిద‌నం అందం క‌ల‌గ‌లిస్తే ఈ సింగ‌ర్స్‌ పాప్‌.భాంగ్రా సూఫీ ఖ‌వ్వాలీ ఇలా మ్యూజిక్‌కు సంబంధించి ప్ర‌తి ఫార్మాట్‌లోను వీరిదే పైచేయి. ఇండియా-పాకిస్తాన్‌ల మ‌ధ్య విభేదాలున్నా. పాట‌ల వ‌ర‌కు వ‌స్తే ఎలాంటి రిస్ట్రిక్ష‌న్స్ లేవు. యూట్యూబ్ పుణ్య‌మా అని వేలాది మంది గాయ‌నీ గాయ‌కులు ఒకే రోజులో స్టార్స్ సింగ‌ర్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. కైలాస్ ఖేర్‌, ద‌లేర్ మెహందీ త‌మ్ముడు మిఖా పాడితే జ‌నం ఊగిపోయారు. హై పీచ్‌లో ద‌మా ద‌మ్ మ‌స్త్ ఖ‌లంద‌ర్ అంటూ మిఖా, కైలాస్‌లు పాడితే ఎలా ఉంటుంది ? స‌ముద్రం ఒక్క‌సారిగా ఉప్పొందిన‌ట్టు అనిపిస్తుంది. అది వారి కున్న టాలెంట్ అలాంటిది మ‌రి.

1957లో పంజాబ్‌లో పుట్టిన ఈ గాయ‌కుడు మోస్ట్ వాంటెడ్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు. దిల్ దా మామ్లా హై పేరుతో పాడిన సాంగ్ ఇండియాను ఊపేసింది. 34 ఆల్బంలు 305 పాట‌లు రాశాడు. మాన్‌కు ఉన్న క్రేజ్‌ను గ‌మ‌నించిన యూట్యూబ్ ఛాన‌ల్ అత‌డితో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంటీవీ కోక్ స్టూడియో కంటిన్యూగా మాన్ పాట‌ల‌ను ప్ర‌సారం చేసింది. ఇదో రికార్డు.జాతీయ స్థాయిలో ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్న మేల్ సింగ‌ర్స్‌లో పంజాబ్ నుండి ఈయ‌న ఒక్క‌రే కావ‌డం గ‌మ‌నార్హం. మామ్లా గ‌డ్ బ‌డ్ హై, చాహ్లా, లాంగ్ ద లిష్కారా అంటూ పాడిన పాట‌లు అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకున్నాయి. కి బాను దునియా దా పేరుతో కోక్ స్టూడియో ద్వారా విడుద‌ల చేస్తే 32 వేల మిలియ‌న్ల ప్ర‌జ‌లు చూశారు. ఇదో రికార్డుగా న‌మోదైంది. ఇందుకు గాను యుకె ఏసియ‌న్ మ్యూజిక్ అవార్డు అందుకున్నారు.హిందీ, బెంగాలీ, త‌మిళ్‌, హ‌ర్యానీ, రాజ‌స్తానీ భాష‌ల్లో ప‌లు పాట‌లు పాడారు మాన్‌. న‌టుడిగా పంజాబీ, హిందీ, హ‌ర్యానీలో పాపుల‌ర్ అయ్యాడు. ఇష్క్ దా వారిస్ పేరుతో పంజాబీలో తీస్తే అది హిట్‌గా నిలిచింది. దానినే హిందీలో హీర్ రాంజా పేరుతో సినిమా వ‌చ్చింది. లెక్క‌లేన‌న్ని పాట‌ల ఆల్బంలు విడుద‌ల చేశాడు.

చ‌క్క‌ర్‌, రాత్ సుహానీ, నాచో బ‌బ్బియో, తూ దాతి ఆసిన్ మాంగే తేరే, ఇబాద‌త్ గురుదాస్ మాన్‌, తేరి ఖైర్ హువే, క్రిపా దాతి ది, వేఖిన్ కితే యార్ నా హావే , చుగ్లియా, యార్ మేరా ప్యార్‌, ప్రాహోనీ, భావెన్ కాఖ్ నా ర‌హే, దిల్ హూ ఛాహిదా జ‌వా, ఫైవ్ రివ‌ర్స్ , జాదూగ‌రేన్‌, ఆజా స‌జ్‌నా, హీర్‌, ఇష్క్ నా దేఖ్లే జాతే, జోగియా, బూట్ పాలిష్‌, స‌దా పంజాబ్‌తో పాటు ఇంకా అనేక ఆల్బ‌మ్స్ రిలీజ్ చేశాడు .గురుదాస్ మాన్ పంజాబ్‌కే కాదు ఇండియాకు విశ్వ వ్యాప్తంగా త‌న పాట‌ల‌తో పేరు తీసుకు వ‌స్తున్నాడు. మ‌రిన్ని పాట‌ల‌తో అల‌రించాల‌ని కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top