సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న…బ్యాచిలర్ బాధ.!

మ‌ద్యం సేవించ‌డం… ఫ్రెండ్స్‌తో బ‌లాదూర్ తిర‌గ‌డం… అమ్మాయిలను తెచ్చుకోవ‌డం… అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం… వంటివి చేస్తార‌నే సాధార‌ణంగా ఎవరూ కూడా త‌మ ఇళ్ల‌ను బ్యాచిల‌ర్స్‌కు రెంట్‌కు ఇవ్వ‌రు. ఇది మ‌న దేశంలో ఎక్క‌డైనా జ‌రిగేదే. కానీ బ్యాచిల‌ర్స్ (ఆడైనా, మ‌గైనా) అంద‌రూ అలా ఉండ‌రు క‌దా. వారిలో మిస్ బిహేవ్ చేసే వారు కొంద‌రే ఉంటారు. మ‌రి వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే నిజాయితీగా ఉండే వారి మాటేమిటి..? అలాంటి వారికి ఇళ్ల‌ను, ఫ్లాట్ల‌ను అద్దెకు ఇస్తే, వారికి ఎవ‌రైనా ఫ్రెండ్స్ (ఆడైనా, మ‌గైనా) ఉంటే, వారు ఆ రెంట్‌కిచ్చిన ఇంటికి వ‌స్తే..? అప్పుడు… వారిని అనుమ‌తించాలా..? వ‌ద్దా..? ఒక‌వేళ అనుమ‌తి దొర‌క్క‌పోతే స‌ద‌రు రెంట్‌కున్న బ్యాచిల‌ర్ ఏం చేయాలి..? అదిగో… స‌రిగ్గా అత‌ను చేసిన‌ట్టే చేయాలి..!

mohit-agarwal
అత‌ని పేరు మోహిత్ అగ‌ర్వాల్‌. గుర్గావ్‌లోని పామ్ గ్రూవ్ హైట్స్ అనే గేటెడ్ అపార్ట్‌మెంట్స్‌లో అత‌ను ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అయితే అత‌ని స్నేహితురాలైన యూర‌ప్‌కు చెందిన ఓ విదేశీ అమ్మాయి ఢిల్లీలోని హ్యూమ‌న్ రైట్స్ ఆర్గ‌నైజేష‌న్ సంస్థ‌లో ప‌ని నిమిత్తం ఇండియాకు వ‌చ్చి మోహిత్‌ను క‌లుసుకుంది. అయితే 3-4 రోజుల పాటు ఢిల్లీకి తిర‌గాల్సి ఉన్నందున ఆమెను త‌న‌తో క‌లిసి త‌న ఫ్లాట్‌లో ఉండ‌మ‌ని మోహిత్ చెప్పాడు. దీంతో ఆమె అంగీక‌రించి మోహిత్‌తోపాటు స‌ద‌రు గేటెడ్ క‌మ్యూనిటీ వ‌ద్ద‌కు చేరుకుంది. అయితే బ్యాచిల‌ర్‌గా ఉన్న మోహిత్ ఫ్లాట్‌కు స‌ద‌రు అమ్మాయిని కాదు క‌దా, క‌నీసం మ‌గ ఫ్రెండ్స్‌ను కూడా రానిచ్చేది లేద‌ని స‌ద‌రు క‌మ్యూనిటీ సెక్యూరిటీ గార్డులు తేల్చి చెప్పారు.
palm-grove-heights
అయితే మోహిత్ స‌ద‌రు సెక్యూరిటీ గార్డుల‌తో కొంత సేపు వాగ్వివాదం పెట్టుకున్నాడు. అనంత‌రం త‌న ఫ్లాట్ ఓన‌ర్‌ను పిలిపించి మాట్లాడించినా ఫ‌లితం లేదు. చివ‌ర‌కు క‌మ్యూనిటీ సెక్ర‌ట‌రీతో ఫోన్‌లో మాట్లాడినా అత‌ను కూడా రూల్స్‌కు వ్య‌తిరేకంగా వెళ్లేది లేద‌ని, ఆమెను వెళ్లిపోవాల‌ని సూచించాడు. దీంతో గ‌త్యంత‌రం లేక స‌ద‌రు అమ్మాయిని మోహిత్ హోట‌ల్‌లో దిగ‌బెట్టి వ‌చ్చాడు. అయితే త‌న ఆవేద‌న‌ను మాత్రం సోష‌ల్ మీడియాలో వెళ్ల‌బోసుకున్నాడు. త‌మ అపార్ట్‌మెంట్స్‌లో అర్థం ప‌ర్థం లేని పిచ్చి రూల్స్ పెట్టార‌ని వాపోయాడు. ఇందులో గ‌మ్మ‌త్తైన విష‌యం ఏమిటంటే స‌ద‌రు క‌మ్యూనిటీలో కార్లు మాత్ర‌మే తిర‌గాల‌ట‌. టూవీల‌ర్స్‌కు అనుమ‌తి లేదట‌. కానీ అక్క‌డ అద్దెకు ఉండే వారిలో 70 శాతం పైగా బ్యాచిల‌ర్సే కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో మోహిత్ సోష‌ల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్‌ల ప‌ట్ల అదే క‌మ్యూనిటీకి చెందిన ఓ మాజీ పోలీస్ అధికారి నుంచి బెదిరింపు కాల్స్‌ను కూడా రిసీవ్ చేసుకున్నాడ‌ట‌. వెంట‌నే ఆ పోస్టుల‌ను డిలీట్ చేయ‌క‌పోతే దాడి చేస్తామ‌ని స‌ద‌రు అధికారి హెచ్చ‌రించాడ‌ట కూడా. అయినా మనోడు మాత్రం, త‌న గోడును ఇంకా అంద‌రితో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. ఏది ఏమైనా మోహిత్ లాంటి నికార్స‌యిన బ్యాచిల‌ర్స్ (అని అనుకుంటున్నాం)కి మాత్రం అలా జ‌ర‌గ‌కుండా ఉండాల్సింది క‌దా..! ఇంత‌కీ, ఈ విషయంలో మీ స్పంద‌న ఏమిటి..? బ‌్యాచిలర్స్‌కి ఇల్లు అద్దెకు ఇవ్వాలా..? వ‌ద్దా..?

Comments

comments

Share this post

scroll to top