“అమృతం” కామెడీతో నవ్వించిన “గుండు హనుమంత రావు” కన్నుమూత..! కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు ఇంతలోనే ఇలా!

ప్రముఖ హాస్య నటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాద పడుతున్న హనుమంతరావు….ఈమధ్య  ఒక టివి షోలో పాల్గొన్నప్పుడు తన అనారోగ్యాన్ని ప్రస్తావించండంతో అందరికి ఈ విషయం తెలిసింది.. వెంటనే సహనటులు   ఆర్దిక సహాయం చేశారు.ఈ మధ్యనే కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు ఇంతలోనే ఇలా జరగడం విషాదం..

ఒరే ఆంజనేయులు తెగ ఆయాసపడిపోకు చాలూ..అంటూ వచ్చే అమృతం సీరియల్లో అంజిగా గుండు హనుమంతరావు ప్రతి ఇంటికి దగ్గరయ్యారు.గుండు హనుమంతరావు 1956లో విజయవాడలో సరోజిని,కాంతారావు దంపతులకు  జన్మించాడు.. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే 1974లో పద్దెనిమిదేళ్ళ వయసులో నాటకరంగం వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం.ఒకసారి  ఆయన వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాలో మొదటిసారిగా వేషం ఇచ్చారు. ఆ తర్వాత కొబ్బరిబోండాం,బాబాయిహోటల్ ,యమలీల,మాయలోడు ,భద్ర,గౌతమ్ ఎస్ఎస్ సి లాంటి అనేక సినిమాల్లో నటించారు..గుండు హనుమంతరావు భార్య ఝాన్సీరాని ప్రమాదవశాత్తు కాలుజారి పడి మరణించారు.ఆ తర్వాత కొడుకు విదేశాల్లో చదువు మానేసి వచ్చిఅనారోగ్యంగా ఉన్న తండ్రిని చూసుకుంటున్నారు..ఆరోగ్య పరంగానే కాదు, ఆర్థికంగానూ గుండు హనుమంతరావు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుండటంతో మెగాస్టార్ చిరంజీవి ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.2లక్షలు ఇటీవలే అందజేశారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా గుండు హనుమంతరావుకు ఆర్థిక సహాయం అందజేసింది.

Comments

comments

Share this post

scroll to top