గుండు హనుమంతరావు కన్నుమూతకు కారణాలు ఇవేనా.? కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..? [VIDEO]

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న గుండు హనుమంతరావు మృతి టాలివుడ్ కి తీరని లోటు.సుమారు 400 సినిమాల్లో హాస్యనటుడిగా  నవ్వులు పంచిన గుండు హనుమంతరావు  ఇకలేరు అనే వార్త జీర్ణించుకోవడం సినిమావారితో పాటు,అభిమానులకు సాధ్యం కావడంలేదు.అమృతం అంజిగా అతడు పండించిన కామెడిని ఎవరూ మర్చిపోలేరు. రిపీటెడ్ గా అన్ని ఛానెల్స్లో ప్రసారమైన ఈ ధారావాహిక ఇప్పటికీ ఆదరణ తగ్గలేదంటే అందులో గుండు హనుమంతరావు పండించిన కామెడి కూడా ఒక కారణం. అనారోగ్యంతో బాధపడుతున్న గుండు హనుమంతరావు  అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.అప్పటికే మృతి చెందినట్టుగా నిర్దారించారు డాక్టర్లు…గుండు హనుమంతరావు మృతికి కారణాలు….

గుండు హనుమంతరావు 1956, అక్టోబర్‌ 10న కాంతారావు, సరోజిని దంపతులకు విజయవాడలో జన్మించారు. తండ్రి చేసిన మిఠాయి వ్యాపారం చూసుకుంటూనే నాటక రంగం మీద ఆసక్తితో 18ఏళ్లకే నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు. స్టేజ్‌ షోలతో పాపులర్‌ అయిన ఆయన జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘అహ నా పెళ్లంట’ చిత్రం ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘అహ నా పెళ్లంట, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, యమలీల, టాప్‌ హీరో, కొబ్బరి బోండాం, బాబాయ్‌ హోటల్, శుభలగ్నం, క్రిమినల్, పెళ్లాం ఊరెళితే, భద్ర’ వంటి చిత్రాల ద్వారా హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్‌ ‘అమృతం’. ఆ సీరియల్‌లో అంజి పాత్రలో ప్రతి ఇంటిలో ఆయన నవ్వుల జల్లులు కురిపించారు.అందులో తన నటనకు గాను ఆయన మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు.

గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాదపడుతున్నారు.భార్య ఝాన్సీ మరణం అతన్ని మరింత కృంగదీసింది అని చెప్పొచ్చు.ఎమ్ఎస్ చదువుతున్న కుమారుడు విద్యను,ఉద్యోగాన్ని కాదనుకుని వచ్చి నాలుగేళ్లుగా తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.ఎన్నో  పాత్రలతో అలరించిన గుండు హనుమంతరావు నాలుగు రాళ్లు వెనకేసుకోలేకపోవడం,తన అనారోగ్యానికి వైధ్యం చేయించుకోవడానికి కూడా మా అసోసియేషన్,తెలంగాణ ప్రభుత్వం ఇతరులు సాయం చేయడం జరిగింది..కిడ్నీ సమస్యకు ఆపరేషన్ చేయించుకున్న గుండు హనుమంతరావు కోలుకుని ఆరోగ్యంగా ఉంటారని అందరూ భావించారు.కానీ మరణించడానికి ముందురోజు రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో,మనల్ని విడిచివెళ్లిపోయారు…శ్వాస ఆడట్లేదని కుటుంబసభ్యులకు చెప్పడంతో హుటాహుటిన హాస్పటల్ కి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది..హాస్పటల్ కి వెళ్లేసరికే ప్రాణాలు పోయినట్టు డాక్టర్లు నిర్దారించారు..ఏదేమైనా కళామతల్లి తన ముద్దుబిడ్డను కోల్పోయింది.

watch video here:

Comments

comments

Share this post

scroll to top