ఫస్ట్ లుక్ ల మంత్రం రుద్రమదేవిని గట్టెక్కిస్తుందా?

తన శక్తి సామార్థ్యాలను, డబ్బును పెట్టి  చారిత్రాత్మక నేపథ్యమున్న చిత్రం రుద్రమదేవిని తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతోంది గుణశేఖర్ చిత్రం .ఈ మూవీలో  కృష్ణం రాజు, అల్లుఅర్జున్, అనుష్క,రానా,నిత్యామీనన్ లాంటి  హేమాహేమీలు నటిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ పాటికే రుద్రమదేవి విడుదల అవ్వాలి, కానీ గ్రాఫిక్స్ ను మరింతగా తీర్చిదిద్దేందుకు కాస్తంత ఎక్కువ టైమ్ తీసుకున్నారు దర్శకనిర్మాత గుణశేఖర్.

ఇంతవరకు మ్యాటర్ బాగున్నా.. ఇప్పుడు గుణశేఖర్ చేస్తున్న కాపీ-పేస్ట్ మంత్రం రుద్రమదేవి సక్సెస్ కు హెల్ప్ అవుతుందా. లేక మైనస్ అవుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. బాహుబలిని చూసి క్యారెక్టర్ వైజ్ గా ఇప్పుడు పోస్టర్లు విడుదల చేసే పనిలో పడ్డారు గుణశేఖర్. ఇప్పటికే కృష్ణంరాజు, అనుష్క,అల్లు అర్జున్ పోస్టర్లు విడుదల చేశారు. తాజాగా ముక్తాంబగా నిత్యామీనన్ ను కూడా పరిచయం చేశారు.

అయితే బాహుబలి విషయంలో పారిన ఈ పోస్టర్ల పాచిక రుద్రమదేవిలో పారుతుందా అనేది సందేహమే.. వాస్తవానికి బాహుబలి సినిమాకు ఈ పోస్టర్ల గోళ ప్రచారాన్నైతే తెచ్చింది కానీ. సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని నిరాశ పరిచింది. అంతర్జాతీయ  రేంజ్ లో ప్రచారం చేసుకున్న రాజమౌళిని గుణశేఖర్ పోస్టర్ల విషయంలో కాపీ కొట్టిన తన సినిమా కు అంతగా ప్రచారం దొరుకుతుందా అనేది మాత్రం అనుమానమే…

rudramadevi poster

ముందుగానే క్యారెక్టర్లను పరిచయం చేస్తే మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఆ ఫీల్ ను , ఆ ఎగ్జైట్ మెంట్ ను మిస్ అవుతాడు. దీంతో సినిమా పై నెగెటివ్ టాక్ గట్టిగా బయటకు వస్తోంది. ఇదే జరిగింది బాహుబలి విషయంలో అంత మంచి డెప్త్ ఉన్న సినిమా అయినప్పటికీ పాత్రల పరిచయం ముందుగానే జరిగిపోవడంతో ప్రేక్షకులు డిస్సపాయింట్ అయిపోయారు. సో…  పోస్టర్ల విషయంలో బాహుబలి నుండి ప్రేరణ పొందిన గుణశేఖర్ తన  రుద్రమదేవిని ఆ ఫస్ట్ లుక్ ల  మంత్రం తో గట్టెక్కిస్తాడా లేదా చూడాలి!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top