గుణశేఖర్ మరో ప్లాన్…రుద్రమదేవి తరహాలోనే..వీరాభిమన్యు.!

రిస్క్ చేసి సక్సెస్ అయిన దర్శకుడు గుణశేఖర్  రుద్రమదేవి  సినిమాతో తన ప్రయాణాన్ని ఆపకుండా మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు.  సేమ్ రుద్రమదేవి తరహాలో మరో సినిమాను తెర మీదకు తెచ్చే ప్రయత్నంలో బిజీ అయ్యాడు. ఆ మేరకు వీరాభిమన్యు అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేసుకున్నాడు. ఎన్నో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలకు మూలాధారం అయిన మహాభారతాన్ని అందులోని అభిమన్యుడి ఘట్టాన్నే కథా వస్తువుగా తీసుకొని భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్టున్నారు గుణ టీమ్.
అయితే ఇప్పటికీ ఇదే టైటిల్ మీద శోభన్ బాబు హీరో గా  ఓ సినిమా కూడా వచ్చింది. మరి గుణశేఖర్ ఆ టైటిల్ కు ముందో ,వెనుకో … ఏదైనా యాడ్ చేస్తారా? లేక వాళ్ళను ఒప్పించి ఇదే టైటిల్ తో వెండితెర మీదకు దూకుతారా? అనేది చూడాలి. అయితే  రుద్రమదేవి సినిమా మాత్రం గుణశేఖర్ లో కాన్పిడెన్స్ ను పెంచింది అనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మరోసారి చారిత్రక నేపథ్యపు స్టోరినే నమ్ముకున్న గుణ ఏం చేస్తాడో చూడాలి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా టైటిట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top