గుజ‌రాత్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో BJP గెలుపు.! అర్థ‌వంత‌మైన విశ్లేష‌ణ మీకోసం.

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో BJP ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు రెండు రాష్ట్రాల్లో BJP గెలుపు ఖాయ‌మే.! గుజరాత్ మోడీ సొంత రాష్ట్రం కావడం, రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫేస్ చేసిన ఫ‌స్ట్ ఎల‌క్షన్స్ ఇవే కావ‌డంతో..ఈ రిజ‌ల్ట్స్ పై ఆస‌క్తి నెల‌కొంది.!

 

గుజ‌రాత్ లోని మొత్తం MLA స్థానాలు:  182

  • BJP ( Lead+Won ) = 105
  • కాంగ్రెస్ ( Lead+Won ) = 74
  • Others( Lead+Won ) = 3.

#2012 ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ @గుజ‌రాత్:

  • BJP=115
  • కాంగ్రెస్=61

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మొత్తం MLA స్థానాలు 68.

  • BJP ( Lead+Won ) = 38
  • కాంగ్రెస్ ( Lead+Won ) = 25
  • Others( Lead+Won ) = 5

#2012 ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్ @హిమాచ‌ల్ ప్ర‌దేశ్:

  • కాంగ్రెస్ = 36
  • BJP = 26


ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రాలు:

కాంగ్రెస్…

గుజ‌రాత్ లో BJP కి అధికారం ద‌క్క‌కుండా చేసేందుకు కాంగ్రెస్ త‌నకున్న అన్ని అవ‌కాశాల‌ను వాడుకుంది. గుజ‌రాత్ ను అభివృద్దిని ప‌ట్టించుకోట్లేద‌ని ప్ర‌ధాన ఆరోప‌ణ‌తో పాటు…. పటేల్స్ కు రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళన చేస్తున్న హార్ధిక్ ప‌టేల్ ను, OBC రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న అల్పేశ్‌ ఠాకూర్ ను, దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తున్న జిగ్నేష్‌ మెవాన్ ను త‌మ‌తో క‌లుపుకొని ఈ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగినా ఫ‌లితం మాత్రం కాంగ్రెస్ కు వ్య‌తిరేఖంగానే వ‌చ్చింది.

BJP….

రామాలయ అంశం, గుజరాత్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ జోక్యం, హార్ధిక్ ప‌టేల్ సెక్స్ వీడియోలనే ప్ర‌చారాస్త్రాలు గా చేసేకొని ఈ ఎన్నిక‌ల‌ను ఫేస్ చేసి విజ‌యం సాధించింది BJP. BJP యే గెలుస్తుందంటూ మీడియా ఇచ్చిన హైప్ కూడా ఈ రిజ‌ల్ట్స్ కు కార‌ణమ‌ని చెప్పుకోవొచ్చు.

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌నే షేక్ చేసిన జీఎస్టీ, డీమానిటైజేష‌న్ ప్ర‌భావం ఈ ఎన్నిక‌ల్లో ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.!

Comments

comments

Share this post

scroll to top