జాగ్రత్త: గుడ్ల గూబను ఇంట్లోకి వదులుతారు.. మొత్తం దోచేస్తారు.. కనీ వినీ ఎరుగని స్టైల్ లో దొంగతనాలు..!

దొంగతనం చేసినందుకు గానూ బెంగళూరు పోలిసులు ఒక గుడ్లగూబను అరెస్ట్ చేశారు..గుడ్ల గూబ దొంగతనం చేయడం ఏంటి అనుకుంటున్నారా.గుడ్లగూబతో పాటు ఇంకో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు లెండి..మరి ఈ గుడ్లగూబకి ,దొంగలకి .. దొంగతనానికి ఉన్న కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారా.. ఉంది..వీరికి దొంగతనంచేయడానికి ఉపయోగపడేదే ఈ గుడ్లగూబ..అదెలా అంటారా…మీరే చదవండి..

ఇప్పటివరకూ ఇలాంటి దొంగతనాలను మీరు అసలు విని కూడా ఉండరు. ఈ దొంగలు ముందుగా గుడ్ల గూబలను ఇంట్లోకి వదులుతారు. అప్పుడు భయంతో ఉన్న కుటుంబ సభ్యులకు ఈ దొంగల బ్యాచ్ సభ్యులు కంటపడతారు. మీ ఇంట్లోకి గుడ్ల గూబ ప్రవేశించింది. ఇకపై మీ ఇంట్లో..మీ జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. ఒకవేళ మేము చెప్పినట్లు చేయలేదో మీరు సర్వ నాశనం అయిపోతారు అంటూ వారిని భయపెడతారు. మీ ఇంట్లో శుభం జరగాలంటే మేము చెప్పిన గుడికి మీరు వెళ్ళి రావాలి అని అంటారు. ఇక అంతే ఆధ్యాత్మికత ఉన్న కుటుంబ సభ్యులు పెట్టే బేడా సర్దుకుని పరిహారం కోసం గుళ్లకు బయలుదేరుతారు. ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది..రాత్రికి దొంగల్లాగా వెళ్లి  ఆ ఇంట్లో ఉన్న వస్తువులను అన్నిటినీ దోచేస్తారు.అదీ విషయం..

వాళ్లు తమ దొంగతనానికి ప్రజల నమ్మకాలను ఎంత భాగా మిక్స్ చేశారంటే..ఒకవేళ ఆ ఇంట్లో వాళ్ళు పుణ్య క్షేత్రాలకు వెళ్ళలేదంటే.. మీరు ఈ ఇంటిని ఎంత వీలైతే అంత తొందరగా అమ్మేయండి అంటూ భయపెడతారు.ఇళ్ళలోకి గుడ్లు విసరడం.. ఎరుపు రంగు నీళ్ళు చల్లడం లాంటివి కూడా చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తారట. వరుసగా జరుగుతున్న విచిత్రానికి శివాలెత్తిపోయిన భక్తులే వారి టార్గెట్ కు బలవుతున్నారు. ఇది దొంగల గేమ్ ప్లాన్ అని తెలియని ఇంటి యజమానులు ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకుంటున్నారట.అప్పుడు కూడా వీళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు నయా బ్యాచ్. వారే వచ్చి అతి తక్కువ డబ్బుకే ఇంటిని సొంతం చేసుకుంటారట. ఇలా తెలివిమీరిపోయిన దొంగలను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇటువంటివి మరికొన్ని ప్రాంతాల్లోనూ జరిగే ప్లాన్ కనిపిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నంత కాలం ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి.. దొంగలు బాగా తెలివి మీరిపోయారు..జనం నమ్మకాల ముసుగులో ఏంచేయడానికైనా వెనకాడరని కనిపెట్టేశారు..ముందు మారాల్సింది మనం.

Comments

comments

Share this post

scroll to top