దేవుడి గుడిలో గంటెందుకు కొడతారో తెలుసా?

గుడిలోకి వెళ్లగానే దేవుడికి ఎదురుగా ఉన్న గంట కొట్టి మనకంతా మంచే జరగాలని మనస్సులో దండం పెట్టుకుంటాం. అంతవరకు ఓకే కానీ అసలు గంటెందుకు కొట్టాలి అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా.. ? గంట కొట్టడం వెనుక మన శాస్త్రాలు చెబుతున్న విషయమేంటి? గంట కొట్టడం వెనకున్న సైన్స్ సూత్రాలేంటో సూక్ష్మంగా తెలుసుకుందాం.

Why should we ring bell

శాస్త్రం:  గంట కొట్టడం అంటే  దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని, ఏ దేవునికి హారతినిస్తున్నామో, ఆ దేవుడు మహాదైవాంశతో విగ్రహంలో చేరాలని,ఆ మహోత్తరమైన అంశ విగ్రహంలో చేరేటప్పుడు ఈ రూపాన్ని భక్తులు కనులారా వీక్షించేలా, హారతి వెలుగులో స్వామిని చూపడమే పరమార్థమని తెలుపుతుంది.

సైన్స్ : మీరు గమనించారో లేదో  దేవాలయాల్లో కంచుతో చేసిన గంటలనే ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటిని కొట్టడం వల్ల  గంట నుండి ఉత్పత్తి అయ్యే శబ్దం కుడి, ఎడమలలోని మెదడుకు ఒకేవిధంగా తరంగాలు చేరవేస్తుందట, ఏడు సెకన్ల పాటు ఆ శబ్దం అలాగే ప్రతిధ్వనిస్తుందట! ఈ శబ్థం  మన శరీరంలోని ఏడు ప్రధాన అవయవాలను ఉత్తేజపరుస్తుందట.. అలాగే మనలోని ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తోందట.!

Comments

comments

Share this post

scroll to top