చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న.? జవాబే లేని ప్రశ్నగా ఇన్ని రోజులు చక్కర్లు కొట్టిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది.! ఇక మిమ్మల్ని ఎవరైనా కోడి ముందా? గుడ్డు ముందా? అని అడిగితే కోడే ముందు అని చెప్పేయండి.! ఎందుకంటే…. గుడ్డు పెంకను తయారు చేయడానికి ప్రొటీన్ కావాలి? ఈ ప్రొటీన్ ను కోడే ఉత్పత్తి చేస్తుంది. సో కోడి లేనిది ఆ ప్రొటీన్ రాదు… ఆ ప్రొటీన్ లేనిది గుండు తయారు కాదు. ! సో క్లియర్ గా కోడే ముందు.!!
ఇలాంటిదే మరో ప్రశ్న చెట్టు ముందా? విత్తు ముందా? అని దాని సమాధానం కూడా చెట్టే ముందు ఎందుకంటే…..
పురాణం ప్రకారం…చెట్టే ముందు:
- క్షీర సాగర మథనంలో ముందుగా ఉద్భవిందించింది చెట్టే, విత్తనం కాదు…దాని పేరు కల్పవృక్షం. రాక్షసులు , దేవతలు వాసుకీ ని తాడుగా చేసి, మందరగిరిని కవ్వంగా మార్చి సాగరాన్ని చిలికితే అందులోంచి వరుసగా….విషం, కామధేనువు ఉచ్చైశ్రవము, ఐరావతం, కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు , మహాలక్ష్మి పుడతారు. విషాన్ని శివుడు తీసుకొని కంఠంలో దాచుకోగా….. కామధేనువు, ఐరావతం, కల్పవృక్షాలను ఇంద్రుడు తీసుకున్నాడు.
సైన్స్ ప్రకారం:
- భూపుట్టుక గురించి తెలిపే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం…….భూమి పుట్టుక తర్వాత ఉద్భవించిన సముద్రాల్లో మొదటగా మొక్కలు ( శైవలాలు ) ఉద్భవించాయని చెప్పబడింది. దీనిని బట్టి చెట్టే ముందు అని చెప్పవచ్చు. దీని మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇస్లాం ప్రకారం:
- ఇస్లాం లో శాంతి వనం అనే మాటను అనేక సార్లు ఉపయోగించడం జరిగింది. సత్ప్రవర్తన, విలువతలో కూడుకున్న వ్యక్తులు నివసించే చోటు శాంతివనం అంటారు. వనం అంటే చెట్ల సమూహం…సో దీనిని బట్టి కూడా చెట్టే ముందు అని చెప్పవచ్చు.