జీఎస్‌టీ వేస్ట్‌, అది విజ‌య‌వంతం కాదు అన్న మోడీ..! ఎందుకో తెలుసా..?

జీఎస్‌టీ విజ‌య‌వంతం కానేకాదు, అదొక విఫ‌ల ప్ర‌యోగం. స‌రైన ప్ర‌ణాళిక, మౌలిక వ‌స‌తులు లేకుండా జీఎస్‌టీని అమ‌లు చేయ‌లేం. ఈ మాట‌లు అన్న‌ది ప్ర‌తిప‌క్షాలు కాదు. సాక్షాత్తూ మన ప్ర‌ధాని మోడీయే. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అదేంటీ… జూలై 1న అర్థ‌రాత్రి అట్ట‌హాసంగా జీఎస్‌టీ ని దేశ వ్యాప్తంగా ప్రారంభించారు క‌దా. దాంతో ఎన్నో ప్రయోజ‌నాలు ఉంటాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఢంకా బ‌జాయించి మ‌రీ చెబుతోంది. మ‌ర‌లాంట‌ప్పుడు మోడీ అలాంటి వ్యాఖ్య‌లు ఎందుకు చేస్తారు..? అని అడ‌గ‌బోతున్నారు క‌దూ..! అయితే అది క‌రెక్టే. కానీ నిజంగా మోడీ పైన చెప్పిన ఆ మాట‌ల‌ను అన్నారు. అయితే అది ఇప్పుడు కాదు. గ‌తంలో..!

గ‌తంలో.. అంటే.. మ‌న ప్ర‌ధాని మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నారు క‌దా. అప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే జీఎస్‌టీని అమ‌లు చేస్తామ‌ని అప్ప‌ట్లోనే కాంగ్రెస్ వారు చెప్పారు. దానికి కౌంట‌ర్‌గా మోడీ అప్పుడు ఏమ‌న్నారంటే.. పైన చెప్పిన మాట‌లే అన్నారు. జీఎఎస్‌టీ ఎప్ప‌టికీ స‌క్సెస్ కాలేద‌ని, అది విఫ‌ల ప్ర‌యోగం అని, స‌రైన వ‌స‌తులు లేకుండా దాన్ని అమ‌లు చేయ‌లేమని అన్నారు. అవును, అయితే ఆయ‌న అలా అంటున్న‌ప్పుడు తీసిన వీడియోల‌నే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బ‌య‌ట పెట్టారు.

జీఎస్‌టీ బిల్లు ప్రారంభం కోసం అన్ని పార్టీల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌కు పిలిచింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అక్క‌డికి వెళ్ల‌లేదు. బ‌హిష్క‌రించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ వారు జీఎస్‌టీ ప్రారంభానికి కొద్ది సేప‌టి ముందు ట్విట్ట‌ర్‌లో ప్ర‌ధాని మోడీ, ఒక‌ప్ప‌టి ముఖ్య‌మంత్రి గా ఉన్న‌ప్పుడు అన్న ఆ వీడియోల‌ను పెట్టారు. దీంతో అవి వైర‌ల్ అయ్యాయి. చూశారా… ప్ర‌ధాని మోడీ ఎలా మాట మార్చారో, అప్పుడేమో జీఎస్టీ వ‌ద్ద‌న్నారు, ఇప్పుడేమో తామే జీఎస్‌టీని ప్ర‌వేశ‌పెట్టారు. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌శ్నించారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కావాలంటే మీరు వాటిని చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top