వ‌సూళ్ల‌లో ముందంజ – జ‌నంలో వెనుకంజ – జీఎస్టీ అంటే భ‌యం భ‌యం.!!

మోడీ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన జీఎస్టీ పేరు ఎత్తితే చాలు కోట్లాది జ‌నం జ‌డుసుకుంటున్నారు. ఉన్న‌త‌, ధ‌న వంతుల వ‌ర్గాల‌ను వ‌దిలేసి సామాన్యుల న‌డ్డి విరుస్తోందంటూ ఆవేద‌న చెందుతున్నారు. దేశ‌మంత‌టా ఒకే ప‌న్ను విధానాన్ని తీసుకు వ‌చ్చి 18 నెల‌లు కావొస్తోంది. అది అమలులోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఇవాళ్టీ వ‌ర‌కు ఎన్నో ఆరోప‌ణ‌లు..మ‌రెన్నో విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆర్థిక మంత్రితో పాటు ఆర్థిక రంగంపై అపార‌మైన అనుభ‌వం , ప‌ట్టు క‌లిగిన ఆర్థిక‌వేత్త‌లు, మేధావులు, ఆడిట‌ర్లు, ఫైనాన్షియ‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్ కు జీఎస్టీ ప‌ట్ల అవగాహ‌న అంతంత మాత్ర‌మే. దీనిని అడ్డం పెట్టుకుని ఆడిట‌ర్స్, సీఏలు , జీఎస్టీ ఎన‌లిస్ట్స్ పంట పండుతోంది. కోట్లు కొల్ల‌గొట్టారు. దేశంలోని అన్ని రంగాల‌కు చెందిన వారంతా జీఎస్టీ ప‌రిధిలోకి వ‌స్తారు. నిత్యం వాడే వ‌స్తువుల‌న్నీ జీఎస్టీ ప‌రిధిలోకి వ‌స్తాయి. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా కేంద్ర స‌ర్కార్ ప‌న్నుల వ‌సూళ్ల‌లో ముందుకెళుతోంది. సామాన్యుల‌కు అవ‌స‌ర‌మైన 99 శాతం వ‌స్తువుల‌ను 18 శాతం లోపు ఉండేలా చేస్తోంది. మోడీ నిర్ణ‌యం మేర‌కు జీఎస్టీ కౌన్సిల్ ఇంకా ఏమైనా త‌గ్గించే విష‌యంలో ఆలోచిస్తోంది. ల‌గ్జ‌రీ ప్రొడ‌క్ట్స్ 28 శాతం లోపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటోంది.

2017 జూలై 1న అర్ధ‌రాత్రి పార్ల‌మెంట్ లో ఏకీకృత ప‌న్ను విధానాన్ని చ‌ట్టంగా ఆమోదించింది. ఈ విధానం అమ‌లులో ఆరంభంలో ఎన్నో స‌వాళ్లు , ఇబ్బందులు ఎదుర‌య్యాయి. మోడీ స‌ర్కార్ తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గించ‌డం, వ్యాపారుల‌పై ప్ర‌భావం, రాష్ట్రాలు పూర్తిగా ఆదాయాన్ని కోల్పోయే స్థితిలోకి రావ‌డం జ‌రిగింది. దీంతో జీఎస్టీ వ‌ద్దంటూ దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు , నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కేంద్రం రంగంలోకి దిగింది. వ్యాపారులు న‌ష్ట‌పోకుండా ఇన్ ఫుట్ ట్యాక్స్ క్రెడిట్ ను అందించింది. రాహుల్ గాంధీ జీఎస్టీకి వేరే పేరు పెట్టారు. గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ గా అభివ‌ర్ణించారు. ఒకే దేశం..ఒకే ప్ర‌జ‌..ఒకే చ‌ట్టం..ఒకే ప‌న్ను ఇదే మా నినాదం అంటున్నారు మోడీజీ. నాలుగైదు ప‌న్నుల రేట్ల‌ను నిర్ణ‌యించ‌డంలో ఎన్నో లోపాలు ఉన్నాయ‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. యూకే, సింగ‌పూర్ మాదిరిగా సింగిల్ రేటు సిస్టంను ఎందుకు డెవ‌ల‌ప్ చేయ‌డం లేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దీనిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేంద్ర స‌ర్కార్ స్పందించింది. త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే మూడు రాష్ట్రాలను కోల్పోయింది బీజేపీ. అన్ని వ‌ర్గాల‌కు అనుగుణంగా ..సంతృప్తి చెందే విధంగా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోందీ ప్ర‌భుత్వం.

శ్లాబ్ రేట్స్ ప్ర‌కారం ఇంకా కొన్ని వ‌స్తువుల‌ను చేర్చాల్సి ఉంది. 0 – 5- 12-18-28 స‌రైన దానిని ఎంపిక చేయాల్సి ఉంది. 31వ జీఎస్టీ కౌన్సిల్ లో 24 వ‌స్తువులపై ప‌న్ను త‌గ్గించింది.
జీఎస్టీ వ‌చ్చాక కేంద్ర‌, రాష్ట్రాలు విధించే ప‌న్నులు గ‌ణ‌నీయంగా త‌గ్గి పోయాయి. ఇంకా పూర్తిగా జీఎస్టీ కౌన్సిల్ అమ‌లుపై దృష్టి సారించాల్సిన అవ‌సరం ఉన్న‌ది. జీడీపీలో ప‌న్నుల వ‌సూళ్ల నిష్ప‌త్తి గ‌రిష్టంగా 11.6 శాతాన్ని తాకింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం 12.1 శాతానికి పెరిగింది. ఇది ఆర్థిక రంగానికి ఊత‌మిచ్చేదిగా ఉంది. జీఎస్టీ అమ‌లు చేయ‌డం వ‌ల్ల‌నే ప‌న్నులు భారీగా వ‌సూలవుతున్నాయ‌ని కేంద్ర స‌ర్కార్ చెబుతోంది. జీఎస్టీ వ‌సూళ్లు ప్ర‌తి నెలా ల‌క్ష కోట్లు దాటాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబ‌ర్ నెల‌లు మాత్రమే ఆ టార్గెట్ ను అధిగ‌మించాయి. జ‌న‌వ‌రిలో 86 వేల 318 కోట్లు వ‌సూలైతే..ఫిబ్ర‌వ‌రిలో 85 వేల 174 కోట్లు, మార్చిలో 96 వేల కోట్లు, ఏప్రిల్‌లో 1,03 , 459 కోట్లు, మేలో 94 వేల 016 కోట్లు, జూన్‌లో 95 వేల 610 కోట్లు, జూలైలో 96 వేల 483 కోట్లు, ఆగ‌స్టులో 93 వేల 960 కోట్లు అక్టోబ‌ర్‌లో 1, 00, 710 కోట్లు, న‌వంబ‌ర్‌లో 97 వేల 637 కోట్లు వసూల‌య్యాయి. ఇన్నేళ్ల‌లో వ‌సూళ్ల‌లో ఇదో రికార్డుగా న‌మోదైంది.

బీజేపీ తీసుకున్న ఈ అసాధార‌ణ నిర్ణ‌యం జ‌నాన్ని కొంత మేర‌కు భ‌య‌పెట్టినా రాను రాను అల‌వాటు ప‌డ్డారు. గ‌ణ‌నీయంగా ఆదాయం పెర‌గ‌డం, అక్ర‌మార్కుల‌కు ఇబ్బందిగా మార‌డం జ‌రిగింది. ప‌న్నులు చెల్లించ‌కుండా ఆదాయాన్ని గ‌డిస్తున్న వారు, బ్లాక్ మ‌నీని క‌లిగి ఉన్న వారికి జీఎస్టీ అడ్డంకిగా మారింది. జీఎస్టీ గురించి దేశ వ్యాప్తంగా జ‌నానికి, అన్ని వ‌ర్గాల వారికి అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Comments

comments

Share this post

scroll to top