GST ఎఫెక్ట్ మ‌ద్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల మీద ఎలా ఉంటుంది? ఎక్క‌డ ఖ‌ర్చు పెరుగుతుంది, ఎక్క‌డ త‌గ్గుతుంది??

ఒకే దేశం – ఒకే పన్ను విధానం-GST నినాదం. జూలై ఒకటో తేదీ నుంచి GST అమల్లోకి రాబోతుంది. ఈ GST ఎఫెక్ట్ మ‌ద్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌పై ఎలా ఉంటుంది…. వాళ్లు చేసే రెగ్యుల‌ర్ ఖ‌ర్చులు పెర‌గ‌నున్నాయా? త‌గ్గ‌నున్నాయా? అనే డీటైల్స్ ను ఓ సారి ప‌రిశీలిద్దాం.!!

లైఫ్ ఇన్సూరెన్స్ :

మీ ప్రీమియం రూ.15 వేలు అనుకుంటే. ప్రస్తుతం మీరు రూ.2వేల 250 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GST పరిధిలోకి వచ్చిన రూ.2,700 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 450 రూపాయలు భారం కానుంది.( 15 నుండి 18 శాతానికి పెర‌గ‌నున్న టాక్స్…3 శాతం అధ‌నం)

బంగారం ఆభరణాలు:

రూ.60వేల విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు రూ.1,800 ట్యాక్స్ ప్రస్తుతం చెల్లిస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.2వేలు కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.200 భారం పడుతుంది. ఇప్పటి వరకు 2 నుంచి 2.5శాతంగా ఉన్న ట్యాక్స్ రేటును ఇప్పుడు 3శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.

 

హోటల్ రూమ్ రెంట్ :

మీరు తీసుకునే గది అద్దె రూ.7వేలు ఉంటే ప్రస్తుతం రూ.1400 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GSTలోకి వస్తుండటంతో అది రూ.1960 అవుతుంది. వెయ్యిలోపు అద్దె గదులు GST పరిధిలోకి రావు.

వంట నూనె :

రూ.200 విలువైన వంట నూనె కొనుగోలు చేస్తున్నట్లయితే ప్రస్తుతం రూ,.23 ట్యాక్స్ చెల్లిస్తున్నారు. GST పరిధిలోకి రావటం వల్ల కేవలం 10 రూపాయలు మాత్రమే పన్ను పడుతుంది. ఇక్క‌డ 100 కి 13 రూపాయ‌లు మిగిలిన‌ట్టే.!!

టెలికాం :

మీ ఇంట్లో రెండు ఫోన్లు, ఓ డీటీహెచ్ సర్వీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కామన్. ప్రస్తుతం మీరు కనీసంగా రూ.2,500 బిల్లు చెల్లిస్తున్నారు. అంటే రూ.375 ట్యాక్స్ కడుతున్నారు. GST పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.450 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.75 అదనంగా భారం పడుతుంది.

రెస్టారెంట్ బిల్లు :

ఇద్దరు పెద్దలు, ఇద్దలు పిల్లలు కలిసి ఫ్యామిలీ రెస్టారెంట్ కు వెళితే రూ.2వేలు బిల్లు అయితే ప్రస్తుతం రూ.270 పన్ను కడుతున్నారు. GST పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు చెల్లించాల్సింది రూ.360. అంటే 90 రూపాయలు అదనపు భారమే.

రెడీమేడ్ దుస్తులు :

రూ.2వేల రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తే ప్రస్తుతం మీరు చెల్లిస్తున్నది రూ.130 ట్యాక్స్. GST పరిధిలోకి రావటం వల్ల మీరు రూ.240 పన్ను కట్టాలి. అంటే అదనంగా మీపై పడి భారం రూ.110.

సినిమా వినోదం :
వినోదానికి సంబంధించి రెండు వ‌ర్గాలుగా విభ‌జించారు. ధియేట‌ర్స్ కు , ఇత‌ర ప్ర‌ద‌ర్శ‌నల‌కు 18 శాతం,సినిమాలు, ఐపిఎల్ లాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కు 28 శాతం గా టాక్స్ ను ఫిక్స్ చేశారు. నలుగురి ఫ్యామిలీ మల్టీఫ్లెక్స్ కు సినిమాకు వెళితే రూ.1200 ఖర్చు అవుతుంది. అందుకు మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న ట్యాక్స్ రూ.360. GST పరిధిలోకి వచ్చిన తర్వాత రూ.336 కట్టాల్సి ఉంటుంది. కాస్త మిగులు 24 Rs.

రైలు ప్రయాణం – A/C :

మూడు వేల రూపాయల విలువైన టికెట్లు మీరు కొనుగోలు చేస్తే ప్రస్తుతం కడుతున్న పన్ను రూ.131 మాత్రమే. ఇక నుంచి రూ.150 కట్టాలి. అంటే రూ.19 అదనంగా చెల్లిస్తారు GSTలో.

మొత్తంగా ఓ మధ్య తరగతి కుటుంబంపై GST భారం కనిపిస్తోంది. వీకెండ్ ఎంజాయ్ చేద్దామంటే జేబుల్లో నుంచి మరిన్ని నోట్లు బయటకు తీయాల్సిందే. ఫోన్ బిల్లుల మోత మోగనుంది.

 

SOURCE: V6.

Comments

comments

Share this post

scroll to top