ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే.. వైద్యులు మీతో ఉన్నట్టే..!

ఇప్పుడంటే ఎక్కడ చూసినా స్థలం లేకుండా భవనాలతో కాంక్రీట్ జంగిల్‌గా మారింది కానీ ఒకప్పుడు అలా కాదు. ఇల్లు, ముందు, వెనుక భాగాల్లో చక్కని పెరడు. కూరగాయలు, పూల మొక్కలు, చెట్లు ఉండేవి. దీంతో ఏదైనా అస్వస్థత కలిగితే పెరట్లో ఉండే మొక్కలతోనే మన పెద్దలు వైద్యం చేసే వారు. కానీ ఇప్పుడదంతా కనుమరుగైంది. అయితే కింద సూచించిన మొక్కలను మాత్రం మీరు ఇప్పటికీ ఇంటి దగ్గర కుండీల్లోనూ పెంచుకోవచ్చు. వీటి వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలను ఇట్టే నయం చేసుకోవచ్చు కూడా. మరి ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. తులసి
చాలా మంది ఈ మొక్కను ఇండ్లలో పెంచుకుంటారు. మహిళలైతే రోజూ తులసి మొక్క చుట్టూ తిరిగి ప్రార్థిస్తారు. అయితే ఈ మొక్కను ఎంచక్కా కుండీలో కూడా పెంచుకోవచ్చు. మొక్క ఆకుల వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి సమస్యలు పోతాయి. ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. అజీర్ణం, తలనొప్పి, నిద్రలేమి సమస్యలు దూరమవుతాయి. కలరా కూడా దరిచేరదు. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు తులసిలో పుష్కలంగా ఉండడం వల్ల రోగ కారక క్రిములు శరీరంలో నుంచి పారిపోతాయి.

2. మెంతి
ఈ మొక్క కూడా కుండీలో పెరుగుతుంది. దీని ఆకుల రసం వల్ల కాలేయ క్యాన్సర్ పోతుంది. జీర్ణక్రియ వృద్ధి చెందుతుంది. మధుమేహం తగ్గుతుంది. బాలింతల్లో చనుబాలు పెరుగుతాయి. రుతు సమయంలో వచ్చే నొప్పి నుంచి మహిళలకు ఉపశమనం కలుగుతుంది. కడుపులో మంట, అల్సర్లు తగ్గుతాయి. రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. నోటి దుర్వాసన పోతుంది.

3. నిమ్మ
ఈ మొక్క కుండీలో కూడా పెరుగుతుంది. నిమ్మ ఆకుల రసం తీసుకుంటే నరాల బలహీనత పోతుంది. ఒత్తిడి తగ్గుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. జ్వరం తగ్గుతుంది. దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లు పోతాయి. కడుపు నొప్పి, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ఉండవు.

4. కలబంద
ఇది చాలా అద్భుతమైన మొక్క. కుండీల్లో చక్కగా పెరుగుతుంది. కలబంద ఆకుల్లో ఉండే గుజ్జు మనకు ఎంతగానో దోహదం చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ముఖ్యంగా కలబంద గుజ్జును రోజూ ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. కలబంద గుజ్జును తింటే జీర్ణ వ్యవస్థ శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. మధుమేహం తగ్గుతుంది. అధికంగా ఉండే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

5. బ్రహ్మి
కుండీల్లో ఈ మొక్క చాలా సులభంగా పెరుగుతుంది. దీని ఆకుల రసాన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. పిల్లలకు ఈ రసం పాలలో కలిపి రోజూ ఇస్తే మంచిది. వారిలో ప్రతిభా పాటవాలు పెరుగుతాయి. గాయాలు, పుండ్లు నయమవుతాయి. నాడీ వ్యవస్థను ఉత్తేజం చేస్తుంది. నరాల బలహీనత పోతుంది. ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.

6. పుదీనా
దీన్ని కూడా చాలా సులభంగా కుండీల్లో పెంచుకోవచ్చు. పుదీనా ఆకుల రసం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. నోటి దుర్వాసన పోతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పి, జ్వరాలు తగ్గుతాయి. బాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుంది.

7. అశ్వగంధ
ఈ మొక్కను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని పిలుస్తారు. ఎందుకంటే ఈ మొక్క ఆకులు, పండ్లు, వేళ్లు అని ఉపయోగమే. వాటి వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ దూరమవుతాయి. నరాల బలహీనత పోతుంది. పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. గుండె సమస్యలు రావు. నేత్ర దృష్టి మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ మొక్కను చాలా సులభంగా కుండీల్లో పెంచవచ్చు.

Comments

comments

Share this post

scroll to top