ఇటువంటి టీచర్లు ఎంతమంది ఉంటారు?

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌నిచేసే ఉపాధ్యాయులు ఎలా ఉంటారో అంద‌రికీ తెలిసిందే. స్టూడెంట్స్ వ‌చ్చినా, రాకున్నా పాఠ‌శాల‌కు స‌రైన స‌మ‌యానికి రాక‌పోవ‌డం, చ‌దువు స‌రిగ్గా చెప్ప‌క‌పోవడం, అస‌లు విద్యార్థుల గురించి ప‌ట్టించుకోక పోవ‌డం, ఇలా చెబుతూ పోతే ఆ స్కూళ్లలో అధిక శాతం మంది ఉపాధ్యాయులు ఒకే త‌ర‌హాలో ఉంటారు. నిజాయితీగా ప‌నిచేస్తూ, విద్యార్థుల‌కు స‌రిగ్గా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు చాలా తక్కువ‌గానే ఉంటారు. అలాంటి వారిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అందుకే కాబోలు వారు బ‌దిలీపై వెళ్తున్నారంటే అక్క‌డి విద్యార్థులు కంట త‌డి పెట్టారు. అవును, మీకీ విష‌యం ఆశ్చ‌ర్యం క‌లిగించినా, మేం చెబుతోంది నిజ‌మే. ఇంత‌కీ ఎవ‌రా ఉపాధ్యాయులు..?
teacher-farewell-750x500
ఉత్త‌రప్ర‌దేశ్‌లోని దేవ్‌రియా, గోరి బ‌జార్ గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో అవినాష్ యాద‌వ్ అనే ఉపాధ్యాయుడు 2009లో విధుల్లో చేరాడు. అయితే ఆ స్కూల్‌లో స్టూడెంట్స్ చాలా త‌క్కువ‌గా ఉండేవారు. ఈ క్ర‌మంలో చాలా మంది విద్యార్థులు అత‌నికి బ‌య‌ట క‌నిపించ‌సాగారు. వారిని స్కూల్‌కు ఎందుకు రావ‌డం లేద‌ని అడిగితే, నిత్యం ప‌నిచేస్తేనే గానీ త‌మ పొట్ట గ‌డ‌వ‌ద‌ని, అందుకే ప‌నిలోకి వెళ్తున్నామ‌ని స‌మాధానం చెప్పేవారు. అయితే అవినాష్ యాద‌వ్ ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల వ‌ద్ద‌కు నిత్యం వెళ్లి వారికి స‌ర్ది చెప్పి, చ‌దువు ప్రాముఖ్య‌త‌ను వివ‌రించి, ఆ పిల్ల‌ల‌ను స్కూల్‌కు ర‌ప్పించ‌సాగాడు. అలా క్ర‌మంగా ఆ స్కూల్‌లో చ‌దువుకునే విద్యార్థుల శాతం పెరిగింది. మొద‌ట్లో ఆ పిల్ల‌ల‌కు అక్ష‌రాలు కూడా స‌రిగ్గా వ‌చ్చేవి కావు, కానీ ఇప్పుడు వారు ఏకంగా అంత‌ర్జాతీయ అంశాల‌పై వ్యాసాలు రాయ‌గ‌ల‌రు. ఆ స్థాయికి వారిని తీర్చిదిద్దాడు అవినాష్ యాద‌వ్‌. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే మ‌రో ప్రాంతంలో విధులు నిర్వ‌హించేందుకు గాను అత‌న్ని ప్ర‌భుత్వ అధికారులు బ‌దిలీ చేశారు. దీంతో వేరే స్కూల్‌కు అత‌ను వెళ్లాల్సి వ‌చ్చింది. అయితే అలా అంద‌రికీ వీడ్కోలు చెప్పే క్ర‌మంలో అక్క‌డి పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రులు కంట త‌డి పెట్టారు. అవినాష్ యాద‌వ్ త‌మ‌ను వ‌దిలి పెట్టి వెళ్ల‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో అవినాష్‌తో స‌హా అంద‌రూ భావోద్వేగానికి గుర‌య్యారు.
14203291_1741384479445346_8160492102783436586_n
అయితే అవినాష్ యాద‌వ్ మాత్ర‌మే కాదు. అలాంటి ఉపాధ్యాయుడే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌రొక‌త‌ను ఉన్నాడు. అత‌ని పేరు మునీష్ కుమార్‌. ప‌శ్చిమ యూపీలోని షాహ్‌బాద్‌, రాంపురా గ్రామంలో ఉన్న ప్రాథ‌మిక పాఠ‌శాలలో అత‌ను ప్ర‌ధానోపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్నాడు. పైన చెప్పిన అవినాష్ చేసిన‌ట్టుగానే మునీష్ కూడా విద్యార్థుల‌కు చ‌క్క‌గా చ‌దువు చెపుతూ వారిని ప్ర‌తిభావంతులుగా తీర్చిదిద్దాడు. ఈ క్ర‌మంలో అత‌నికి కూడా బ‌దిలీ వ‌చ్చింది. అత‌ను బ‌దిలీపై వెళ్లే స‌మ‌యంలోనూ అక్క‌డి విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు త‌మ దుఃఖాన్ని ఆపుకోలేక‌పోయారు. నిజంగా ప్ర‌తి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోనూ ఇలాంటి ఉపాధ్యాయులే ఉంటే అప్పుడు ఏ విద్యార్థి కూడా డ‌బ్బులు వెచ్చించి విద్య‌ను కొనుక్కోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు కదా..! అయినా, అలా ఎప్పుడు జ‌రుగుతుందో..! అస‌లు,  ఆ విధంగా భార‌త్ మారుతుందో, లేదో వేచి చూడాలి.

Comments

comments

Share this post

scroll to top