బ్లాక్ బోర్డ్ నే కంప్యూట‌ర్ స్క్రీన్ గా మార్చి…బోధిస్తున్న టీచ‌ర్. #హ్యాట్సాఫ్.

ప్ర‌భుత్వం నుండి వ‌చ్చిన కంప్యూట‌ర్స్ ను వాడ‌కుండా.. దుమ్ము ప‌ట్టి స్టోర్ రూమ్ లో ఓ మూల‌న ఉంచిన సిత్రాలు మ‌న స‌ర్కారీ స్కూల్స్ లో ఎన్నో చూశాం.! ఎన్నో టీచింగ్ ల‌ర్నింగ్ మెటీరియ‌ల్స్ అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ..ఓన్లీ చాక్ పీస్ తో పాఠాల‌ను నెట్టుకొచ్చే ఎంతో మంది టీచ‌ర్ల‌ను చూశాం.! కానీ ఇక్క‌డ ఫోటోలో చూస్తున్న ఈ టీచ‌ర్ డెడికేష‌న్ లెవెల్స్ యే వేరు! … స్టూడెంట్స్ కు ఏదో తెలియ‌జెప్పాల‌న్న ఉద్దేశ్యంతో అత‌ను ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు..కేవ‌లం ఈ రెండు ఫోటోలు చాలు.. ఆ టీచ‌ర్ కు చేతులెత్తి దండం పెట్టేలా చేస్తాయి.!


ఈ ఫోటోలో ఉన్న ఉపాధ్యాయుని పేరు ఓవురా….ఘ‌నా దేశంలోని సెక్యెడ్యుమాసే అనే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో కంప్యూట‌ర్ టీచ‌ర్ గా ప‌నిచేస్తున్నాడు. అక్క‌డి స్కూల్స్ నిధుల కొర‌త‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో కంప్యూట‌ర్ విద్య వారికి అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలింది. ఈక్ర‌మంలో ఎలాగైనా పిల్ల‌ల‌కు కంప్యూటర్స్ లో బేసిక్స్ అయినా నేర్పించాల‌ని సంక‌ల్పించాడు ఈ టీచ‌ర్….అనుకున్న‌దే త‌డ‌వుగా ఇదిగో కంప్యూట‌ర్ స్క్రీన్ నే బోర్డ్ మీద రంగు రంగుల చాక్ పీస్ ల స‌హాయంతో దించేసాడు… ప్రాక్టిక‌ల్ నాలెడ్జ్ ను అందించ‌లేక‌పోయినా…వ‌ర్చువ‌ల్ నాలెడ్జ్ ను అందించినా….నా ప్ర‌య‌త్నం కొద్దిమేర‌కైనా స‌క్సెస్ అవుతుంద‌నే ఉద్దేశ్యంతో కంప్యూట‌ర్ లోని కీల‌క సాఫ్ట్ వేర్స్ ను ఎలా ఉప‌యోగించాలి..వాటి ప‌నితీరు ఏంటి అనే విష‌యాల‌ను ఇలా బోర్డ్ పై బొమ్మ‌లేసి మ‌రీ బోధిస్తున్నాడు.!

స్కూల్ త‌ల‌రాతే మారిపోయింది.
ఈ టీచ‌ర్ ఫోటోలు కొద్దిసేప‌ట్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.దీంతో స్కూల్ త‌ల‌రాతే మారిపోయింది. ప్ర‌పంచ న‌లుమూల‌ల నుండి అనేక మంది ఈ స్కూల్స్ కు కంప్యూట‌ర్స్ , లాప్ ట్యాప్స్, డిజిట‌ల్ క్లాస్ రూమ్ ల‌ను అందిస్తామ‌ని ముందుకొచ్చారు. దీంతో ఆ టీచ‌ర్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.! మా పిల్ల‌ల్లో చాలా టాలెంట్ ఉంది, దానికి కాస్త సాంకేతిక యాడ్ అయితే అధ్భుతాలే అంటున్నాడు ఓవురా.!

వృత్తి ప‌ట్ల ఇంత‌టి అంకిత‌భావం చూపిస్తున్న ఈ టీచ‌ర్ కి హ్యాట్సాప్ చెప్పేద్దాం. #హ్యాట్సాప్ ఓవురా.!!!!

Comments

comments

Share this post

scroll to top