ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని…వ్యవసాయం చేస్తూ సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్న యువకుడు.

పట్టుదలతో ప్రయత్నించాలే కానీ, ఇసుక నుండి తైలాన్ని తీయవచ్చు అన్నాడు వేమన….అదే స్ట్రాటజీని ఫాలో అయ్యి..ఈ యువకుడు ఇసుక నేల నుండి…కోట్ల రూపాయాల ఆదాయాన్ని తీస్తున్నాడు.  ఈ ఫోటోలోని వ్యక్తి పేరు హారీష్ ధండేవ్….రాజస్థాన్ కు చెందిన ఈ యువకుడు తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని కొన్ని రోజులు చేసి నచ్చక రాజీనామ చేశాడు.. ప్రభుత్వ ఉద్యోగంతో జీవితం సాఫీగా సాగుతుందనుకున్న తరుణంలో కొడుకు రాజీనామ చేయడం తండ్రికి నచ్చలేదు. ఏంట్రా ఇది ?  రాజీనామా ఎందుకు చేశావ్..?,ఇప్పుడేం చేద్దామనకుంటున్నావ్ ? అని తండ్రి అడిగిన ప్రశ్నలకు వ్యవసాయం చేస్తా అని నవ్వుతూ సమాధానమిచ్చాడు హరీష్.
వ్యవసాయం లాభసాటిగా లేదని నీకు తెలుసు..అయినా మనకున్నది ఇసుక నేలలు…అవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే…అని తిట్టి వెళ్లిపోయాడు తండ్రి…. హరీష్ కుటుంబానికి థార్  ఎడారి చుట్టు పక్కల దాదాపు 120 ఎకరాలు ఉంది. అవన్నీ పూర్తిగా ఇసుక నేలలు.
636039251186059057
అయితే మార్కెట్ స్ట్రాటజీని…. వ్యవసాయ శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న హరీష్ తనకున్న 120 ఎకరాల్లో కలబంద( అలవేరా) మొక్కలను నాటాడు. ఎడారి ప్రాంతంలో అవి త్వరగా పెరుగుతాయ్..దానికి తోడు మార్కెట్ లో ఆ మొక్కకు  విపరీతమైన డిమాండ్ కూడా ఉంది.  ప్రతి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ లో దీనికి అధిక ప్రాధాన్యత, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అలవేరా కు అధిక డిమాండ్ ఉండడంతో…. హరీష్  వ్యవసాయం లాభసాటిగా సాగడం స్టార్ట్ అయ్యింది. దీనికి తోడు  ఇతని అరవేరా మొక్కలను కొనడానికి  పతంజలి ఫుడ్‌ ప్రొడక్జ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఇతనితో  ఒప్పందం కుదుర్చుకుంది. కలబంద సాగు ద్వారా  ఇతను  ఏడాదికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు.
అంతే కాదు తన 120 ఎకరాల్లో 200 కు పైగా జనాలకు ఉపాధిని కూడా ఇస్తున్నాడు..తిట్టిన తండ్రే కొడుకు  తెలివితేటలకు సంబరపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి, దండగ అన్న వ్యవసాయాన్ని పండగగా మార్చి  200 మందికి ఉపాధి కల్పిస్తున్న హరీష్ ను అభినందిద్దాం.

Comments

comments

Share this post

scroll to top