ఈ 27 వస్తువులపై “GST ” స్లాబు తగ్గింది..! ఏ వస్తువుపై ఎంత తగ్గిందో వివరాలు చూడండి!

ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా జీఎస్టీ బిల్లును అమ‌లులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. మొత్తం నాలుగు శ్లాబుల్లో జీఎస్‌టీని అమ‌లు చేస్తున్నారు. 5, 12, 18, 28 శాతాల‌ పేరిట జీఎస్‌టీ బిల్లు అమ‌లులో ఉంది. ఇందుకు గాను ఆయా వ‌స్తువులు, సేవ‌ల‌ను ఈ నాలుగు శ్లాబుల్లో చేర్చి జీఎస్‌టీ వ‌సూలు చేస్తున్నారు. అయితే తాజాగా ప‌లు వ‌స్తువుల‌కు చెందిన శ్లాబుల‌ను మార్చింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అన్‌బ్రాండెడ్ న‌మ్‌కీన్‌, అన్‌బ్రాండెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్‌, హోమియోప‌తి మెడిసిన్‌లు, స్లైస్డ్ డ్రైడ్ మ్యాంగో, ఖాక్రా, ప్లెయిన్ చ‌పాతీ, పేప‌ర్ వేస్ట్‌, స్క్రాప్‌, రియ‌ల్ జ‌రీలు గ‌తంలో 12 శాతం జీఎస్టీ శ్లాబులో ఉండేవి. వీటిని ప్ర‌స్తుతం 5 శాతం జీఎస్‌టీ శ్లాబులో చేర్చారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వారికి ఇచ్చే ఆహార పొట్లాలు, బ‌యోమాస్ దిమ్మెలు, ప్లాస్టిక్‌, ర‌బ్బ‌ర్ వేస్ట్, పెయిరింగ్స్, స్ర్కాప్ లు 18 శాతం జీఎస్‌టీ ప‌రిధిలో ఉండ‌గా వీటిని కూడా 5 శాతం జీఎస్‌టీ ప‌రిధిలోకి తెచ్చారు. హార్డ్ ర‌బ్బ‌ర్ వేస్ట్ లేదా స్క్రాప్‌, ఈ-వేస్ట్‌లు గ‌తంలో 18, 28 శాతం శ్లాబుల్లో ఉండ‌గా వీటిని కూడా 5 శాతం శ్లాబుకు తెచ్చారు. ఇక డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్‌కు గ‌తంలో 5 శాతం జీఎస్టీ ఉండ‌గా ఇప్పుడు దానికి ఎటువంటి జీఎస్టీ లేదు.

వ‌స్త్ర రంగంలో యంత్రాలు లేకుండా మ‌నిషి త‌యారు చేసిన నూలుకు, దారాల‌కు, సింథ‌టిక్‌, ఆర్టిఫిషియ‌ల్ ఫిల‌మెంట్‌, మ‌నిషి త‌యారు చేసిన ఫైబ‌ర్ నూలుకు గ‌తంలో 18 శాతం జీఎస్‌టీ ఉంది. దీన్ని 12 శాతం శ్లాబుకు మార్చారు.

స్టేష‌న‌రీ ఐట‌మ్స్‌, ఫ్లోర్ స్టోన్స్‌, డీజిల్ ఇంజిన్ పార్ట్స్‌, పంప్ పార్ట్స్‌కు గ‌తంలో 28 శాతం జీఎస్‌టీ ప‌డేది. వీటిని 18 శాతం జీఎస్టీ కింద‌కు తెచ్చారు.

ఇక ఇవేకాకుండా రెస్టారెంట్ల‌లో విధించే 18 శాతం జీఎస్‌టీని కూడా 12 శాతం జీఎస్‌టీ కింద‌కు తెచ్చారు. దీంతో ఆ భారం భోజ‌న ప్రియుల‌కు త‌గ్గ‌నుంది. అయితే ఏసీ రెస్టారెంట్ల‌కు గాను మ‌రోసారి ఆలోచించి జీఎస్‌టీ వేస్తార‌ట‌. రెండు వారాల్లో దీనిపై స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. కాగా పైన చెప్పిన జీఎస్టీ శ్లాబు మార్పులు వ‌చ్చే వారం నుంచి అమ‌లులోకి వ‌స్తాయి. ఇక రూ.1.50 కోట్ల వ‌ర‌కు ట‌ర్నోవ‌ర్ ఉన్న వ్యాపారులు 3 నెల‌ల‌కు ఓసారి రిట‌ర్న్స్ ఫైల్ చేయాల‌ట. రూ.75 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్ ఉన్న చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల వారు 1 నుంచి 5 శాతం వ‌ర‌కు ట్యాక్స్ క‌ట్టాల్సి ఉండ‌గా, ఇప్పుడు ఆ ప‌రిమితిని రూ.1 కోటికి పెంచారు.

దాదాపుగా 27 ర‌కాల వ‌స్తువుల‌కు గాను జీఎస్టీ శ్లాబు తగ్గించ‌డంతో ప్ర‌ధాని మోడీ దీపావళి ముందుగానే వ‌చ్చింద‌ని అనగా, దీనికి కాంగ్రెస్ కౌంట‌ర్ వేసింది. జీఎస్టీ బిల్లు అన్ని ర‌కాలుగా విఫలమైంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోప‌ణ‌లు చేయ‌గా, శ్లాబుల మార్పు ప‌ట్ల అన్ని వ‌ర్గాల్లోనూ మిశ్ర‌మ స్పంద‌న క‌నిపించింది.

Comments

comments

Share this post

scroll to top