భిక్షగాళ్లకు గవర్నమెంట్ పుష్కరాల ఆఫర్…!

గోదావరి పుష్కరాలు భిక్షగాళ్ళ పాలిట నిజమైన పండగను తెచ్చినట్టైంది. భిక్షగాళ్ళు చేసే వృత్తి అడుక్కోవడం.. రోజంతా అడుక్కుంటే 300 నుండి 500 దాకా వస్తాయి. కానీ పుష్కరాల సంధర్భంగా ప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ ఆఫర్ సంధర్భంగా రోజుకు 5000 రూపాయలు అడుక్కోకుండానే వాళ్ళ గిన్నెల్లో పడుతున్నాయి. ప్రభుత్వం పుణ్యాన.

ఇదెలా అంటారా… పుష్కరాల్లో భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంబించింది. బిక్షగాళ్లు ఎవ్వరూ పుష్కరాల దగ్గర్లో కనిపించరాదని ఆదేశాలు జారీ చేసింది. జూలై 25 వరకు ఎవ్వరూ పుష్కర ఘాట్ల వద్దకు రాకూడదని అందుకుగాను ప్రతి బిక్షగాడికి రూ 5000 చెల్లిస్తామని కూడా ప్రకటించింది. గవర్నమెంట్   స్కీమ్ బాగుండడంతో భిక్షగాళ్ళు కాళ్లమీద కాళ్లు వేసుకొని తమ డ్యూటీకి అటెండ్ అవ్వట్లేరు. ఎలాగో ప్రభుత్వం అయిదు వేలు ఇస్తుందిగా అని

ఇక్కడ వరకు మ్యాటర్ బాగున్న అసలు చిక్కు ఇప్పుడొచ్చి పడింది. ఈ విషయం తెలుసుకున్న సామాన్యులు కూడా తాము భిక్షగాళ్లమే తమకు 5000 ఇవ్వాల్సిందేనని పట్టుపడుతున్నారు. భిక్షగాళ్ళమని ఒప్పుకుంటే రోజుకు 5 వేల రూపాయలు ఇస్తే మూడు రోజులకి 15000 వేలు ఫ్రీగా వచ్చేస్తాయని వాళ్ల లాజిక్, దీంతో తలపట్టుకున్న  గోదావరి కలెక్టర్ ముఖ్యమంత్రి గారు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top