పండుటాకుల‌కు కొండంత అండ – సంర‌క్ష‌ణ బాధ్య‌త పాల‌కుల‌దే

జీవితం అన్నాక వృద్ధాప్యం స‌హ‌జం. రెక్క‌లు ముక్క‌లు చేసుకుని క‌ని..పెంచి..పెద్ద‌చేసి..ప్ర‌యోజ‌న‌ల‌ను చేస్తే..ప్ర‌బుద్దులు..ద‌ద్ద‌మ్మ‌లు..అమ్మ‌ల‌క్క‌లు అమెరికా జ‌పం చేసుకుంటూ అక్క‌డే తిష్ట వేసుకుని కూర్చుంటున్నారు. రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించి దాచుకున్న సొమ్ముల్ని దోచుకుంటున్నారు. పైసా పైసా దాచి కూడ‌బెట్టుకున్న ఆస్తుల‌ను కైవ‌సం చేసుకుంటున్నారు. న‌యానో భ‌యానో త‌మ పేర్ల‌పై రాయించుకుంటూ స‌భ్య స‌మాజం సిగ్గుప‌డేలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వంద‌లో కొంద‌రు మాత్రమే క‌న్న‌వారిని, తాత అమ్మ‌మ్మ‌, నాయిన‌మ్మ‌లను చూసుకుంటున్నారు. మిగ‌తా వారంతా ఎంజాయ్‌కే ప్రాధాన్యం ఇస్తూ లైఫ్‌ను గ‌డిపేస్తున్నారు. అంతా డాల‌ర్ల మాయ. ఎక్క‌డున్నారంటే ఇదుగో వాట్స‌ప్ ఉందిగా..స్కైప్ ఆన్ చేయండి ..అందులో మేం క‌నిపిస్తాం..మీరూ మాకు అగుపిస్తారంటూ ప్రేమ ఒల‌క‌బోస్తున్నారు బిడ్డ‌లు.

old age people

కొంద‌రైతే భార‌మ‌వుతార‌ని రోడ్ల మీదే ప‌డేసిన దాఖలాలు కోకొల్ల‌లు. వృద్ధుల‌ను గౌర‌వించ‌డం..వారికి మెరుగైన సంర‌క్ష‌ణ క‌ల్పించ‌డం..సౌక‌ర్యాలు ఏర్పాటు చేయ‌డం..వృద్ధుల‌కు ప్రత్యేకంగా ఆశ్ర‌మాలు నిర్వ‌హించ‌డం..ఒక‌వేళ వుంటే అవి స‌క్ర‌మంగా ఉన్నాయో లేదో చూడాల్సిన బాధ్య‌త ఆయా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ఉంది. ఈ విష‌యాన్ని భార‌త స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం..ధ‌ర్మాస‌నం తీర్పు చెప్పంది. వ‌యోధికులు ఎక్క‌డికి వెళ్ల‌లేరు..ఏ ప‌నీ చేయ‌లేరు. వారికి శ‌క్తి అంటూ వుండ‌దు. స‌వాల‌క్ష రోగాలతో స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అలాంటి వారికి అండ‌గా లేక‌పోతే ఎలా..అని ప్ర‌శ్నించింది. దేశ వ్యాప్తంగా ఎన్ని వృద్ధాశ్ర‌మాలు ఉన్నాయి. వాటిలో ఎంత మందికి వ‌స‌తి సౌక‌ర్యం ద‌క్కింది. వైద్యం అందుతోందా సౌక‌ర్యాల క‌ల్ప‌న ఎట్లా ఉందో పూర్తి వివ‌రాలు త‌క్ష‌ణ‌మే అంద‌జేయాల‌ని ఆదేశించింది. జిల్లాల‌లో ..ప‌ట్ట‌ణాల్లో ..ప‌ల్లెలో స్వ‌చ్ఛంధ సంస్థ‌లు, వ్య‌క్తులు , కంపెనీల య‌జ‌మానులు వృద్ధాశ్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. కొంద‌రు త‌మ దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తే..ఇంకొంద‌రు స్వంతంగా తాము సంపాదించిన ఆదాయంలోంచి కొంత మొత్తాన్ని సాయంగా తోడ్పాటు అందిస్తున్నారు. వృద్దుల సంర‌క్ష‌ణ‌, బాధ్య‌త చాలా రిస్క్‌తో కూడుకున్న ప‌ని. సేవ చేసే వారే కావాల్సి ఉంటుంది. వీట‌న్నింటి బాధ్య‌త ..పాల‌కుల‌దేన‌ని స్ప‌ష్టం చేసింది ధ‌ర్మాస‌నం.

నిరాద‌ర‌ణ‌కు గుర‌య్యే వ‌యోధికుల ప‌ట్ల జాలి కురిపించ‌కండి..వారికి సాయంగా ఉండే ప్ర‌య‌త్నం చేయండి..వృద్దుల‌కు కూడా హ‌క్కుల‌ను క‌ల్పించింది భార‌త రాజ్యాంగం. దేశంలో 10 కోట్ల మందికి పైగా వృద్ధులున్నారు. వారంద‌రికీ చ‌ట్ట‌బ‌ద్ధ హ‌క్కుల్ని క‌ల్పించాలి. వృద్దాశ్ర‌మాలు జిల్లాల వారీగా వివ‌రాలు సేక‌రించండి. వారికి వైద్య స‌దుపాయాలు అందుతున్నాయా లేదా అన్న‌దే ప్ర‌ధానం. పండుటాకుల‌కు స‌రైన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో పాల‌కులు విఫ‌ల‌మ‌య్యార‌ని. వారు కూడా మ‌నుషులేన‌న్న ధ్యాస లేకుండా పోయింద‌ని..వారిని ఆదుకోవాల‌ని కోరుతూ మాజీ మంత్రి అశ్వినికుమార్ సుప్రీంకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు స్పందించిన అత్యున్న‌త న్యాయ స్థానం కోలుకోలేని తీర్పు చెప్పింది. ఈ తీర్పు పాల‌కుల‌కు, ప్ర‌భుత్వాల‌కు చెంప పెట్టు. జ‌స్టిస్ లోకూరు, దీప‌క్ గుప్తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం వ‌యోధికుల బాధ్య‌త స‌మాజంపై ఉంద‌న్నారు. నెల నెలా 200 లేదా 500 ఇస్తే స‌రిపోతుందా..వారు గౌర‌వ ప్ర‌దంగా బ‌తికేలా ప్ర‌భుత్వాలు ఏర్పాటు చేయాలి. వారికి ప్ర‌త్యేకంగా సంక్షేమ నిధిని స‌మ‌కూర్చాలి. త‌ల్లిదండ్రులు, వ‌యోధికుల సంక్షేమ చ‌ట్టం -2007 కింద ఉన్న నిబంధ‌న‌ల గురించి ప్ర‌జ‌లంద‌రికి తెలియ చేయాల్సిన బాధ్య‌త కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దేన‌ని ఆదేశించింది. జ‌న‌వ‌రి 31 లోగా వ‌యోధికుల సంక్షేమం కోసం ఏయే చ‌ర్య‌లు తీసుకుంటున్నారో. ఎలాంటి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారో ..పూర్తి రిపోర్టు స‌మ‌ర్పించాల‌ని తీర్పు చెప్పింది.

ధ‌ర్మాస‌నం తీర్పు ఒక సంచ‌ల‌న‌మైన‌దిగా భావించాలి. పాల‌కులు పూర్తిగా నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల‌నే ఇవాళ వ‌యోధికుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. దేశ‌మంత‌టా అంద‌రికీ ఒకే రీతిన పెన్ష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తే మ‌రింత ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ప్ర‌తి నెలా క‌నీసం ప్ర‌తి ఒక్క‌రికి 3000 రూపాయ‌ల చొప్పున చెల్లిస్తే గౌర‌వ ప్ర‌దంగా జీవించే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా ప్ర‌భుత్వాలలో క‌ద‌లిక వ‌స్తుంద‌ని ఆశిద్దాం. అంత‌వ‌ర‌కు పండుటాకుల‌కు మ‌నం చేయూత‌నిద్దాం.

Comments

comments

Share this post

scroll to top