గోపీచంద్ “యజ్ఞం” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె మనం రోజు చూసే సీరియల్ లో బామ్మగా నటిస్తుంది.!

సినీ పరిశ్రమలో హీరోలకు వయసు పెరగదు. ముఖ్యంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీ లో హీరోలు రియల్ గా తాతలు అయినా సరే.. వెండి తెరపై 18 ఏళ్ల భామతో ఆడాలి, పాడాలి.. ఫైట్స్ చేయాలి. గతంలో ఎన్టీఆర్, ఏన్నార్, ఎమ్జీఆర్, రాజకుమార్ వంటి వారు .. ఆ తరం తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి వారు స్టెప్స్ వేస్తూ.. ఫైట్స్ చేస్తున్నారు. లేదంటే.. ఇమేజ్ ఒప్పుకోదు.. ముఖ్యంగా అభిమానులు అంగీకరించరు.

అదే హీరోయిన్ల విషయం కి వస్తే.. 30 ఏళ్ళు రాగానే ఫెడ్ అవుట్ అయిపోతారు.. హీరోయిన్ నుంచి అక్క, అమ్మ పాత్రలకు షిఫ్ట్ అవుతారు. హీరో పక్కన హీరోయిన్ గా నటించిన వారికే వెండి తెరపై అమ్మగా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోగా అడుగు పెట్టిన గోపీచంద్ కు మొదటి హిట్ ఇచ్చిన సినిమా యజ్ఞం. ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా నటించిన ముంబై భామ సమీరా బెనర్జీ కి కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

కానీ గోపీచంద్ కెరీర్ బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాతో దూసుకొని పోయాడు. వరస ఆఫర్లు అందుకొన్నాడు. కానీ సమీరా కి మాత్రం ఆఫర్లు దక్కలేదు. కలకత్తాలో పుట్టిన ఈ సమీరా.. బాలనటిగా చాలా యాడ్స్ లో కనిపించింది. చదువు పూర్తి అయ్యాక హిందీ సీరియల్స్ లో 2001 లో అడుగు పెట్టింది.. హిందీ సీరియల్స్ లో నటిస్తూనే తెలుగులో గోపీచంద్ తో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకొన్నది. కానీ ఆఫర్స్ లేని ఈ భామ మళ్ళీ బుల్లి తెరపై దృష్టి పెట్టింది.. పాపులర్ హిందీ సీరియల్ ససురాల్ కి అనురాగ్ పూల్ లో హీరోకి అక్కగా నటించింది.

ఈ సీరియల్ తెలుగు లో అత్తారిల్లు గా వచ్చింది. ఆ తర్వాత నీరజ్ శర్మ .. నిర్మాతను పెళ్లి చేసుకొన్నది. సమీరాకు ఇప్పుడు 4 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.. తన వయసు వారందరూ ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుంటే.. సమీరా మాత్రం హిందీ పాపులర్ సీరియల్ కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ సీరియల్ లో హీరోయిన్ కు తల్లిగా అమ్మమ్మగా నటిస్తుంది. ఏది ఏమైనా మన సినీ పరిశ్రమలో హీరోలకు ఉన్నత జర్నీ.. హీరోయిన్లకు ఉండదు..!!

Comments

comments

Share this post

scroll to top