“గౌతమ్ నందా” ఆడియో లాంచ్ లో హీరోయిన్ పేరు మర్చిపోయిన “గోపీచంద్”..! కాథరిన్ అనబోయి తమన్నా

యంగ్ హీరో గోపీచంద్ న‌టించిన తాజా మూవీ గౌత‌మ్ నంద‌..ఈ మూవీకి సంప‌త్ నంది ద‌ర్శ‌కుడు. హన్సిక, కేథరిన్‌ కథానాయికలు. శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్‌, జె.పుల్లారావులు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీకి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడు.. ఈ మూవీ ఈ నెల 28వ తేదిన విడుద‌ల కానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని ఆదివారం సాయంత్రం నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ లోని జె ఆర్ సి ఫంక్ష‌న్ హాలులో జరిగిన ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజరయ్యారు.. ఈ ఆడియో వేడుక‌లో భాగంగా ప్ర‌త్యేక ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. బోనాల శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ ప్రొమోను రూపొందించారు.

అయితే ఆడియో లాంచ్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ…హీరోయిన్లు తమన్నా, హన్సిక చాలా బాగా చేసారు అని నోరు జారారు. కాథరిన్ అనబోయి తమన్నా అనేసారు. వెంటనే స్టేజి మీద అందరు నవ్వేశారు. ఆ వీడియో మీరే చూడండి!

Comments

comments

Share this post

scroll to top